భారత్ మార్కెట్లోకి... సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 4జీ ఎల్టీఈ వేరియంట్!

Posted By:

దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఎట్టకేలకు 4జీ ఎల్టీఈ సపోర్ట్ ఫీచర్‌తో కూడిన గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.53,000. జూలై 20నుంచి ఈ డివైస్ మార్కెట్లో లభ్యంకానుంది. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ 8974 ప్రో 2.5గిగాహెట్జ్ ప్రాసెసర్ 8 4జీ ఎల్టీఈ బ్యాండ్‌‍లను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ఎయిర్‌టెల్ 2 నెలల వ్యాలిడిటీతో కూడిన 5జీబి 4జీ డేటాను అత్యుత్తమ 4జీ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

 భారత్ మార్కెట్లోకి... సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 4జీ ఎల్టీఈ వేరియంట్!

గెలాక్సీ ఎస్5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5.1 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్,
ఆండ్రాయిడ్4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
16 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
ఫింగర్ ప్రింట్ స్కానర్,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot