అమితాబ్ ఇప్పుడు శాంసంగ్ 'మై మూవిస్ అప్లికేషన్'లో..

Posted By: Super

అమితాబ్ ఇప్పుడు శాంసంగ్ 'మై మూవిస్ అప్లికేషన్'లో..

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌కి పెట్టింది పేరు. శాంసంగ్ ఏ పని చేసినా అది కస్టమర్స్‌ని ఆకర్షించేదిగా ఉంటుంది. శాంసంగ్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని కొత్తగా ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ II స్మార్ట్ ఫోన్స్ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 750ల కొసం ఇండియన్ డివిడి కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన 'బిగ్ ఫిక్స్' ద్వారా కస్టమర్స్ కొసం 'మై మూవిస్ అప్లికేషన్'ని విడుదల చేసింది.

శాంసంగ్ గెలాక్సీ ప్రోడక్ట్స్ కొసం రూపొందించిన 'మై మూవిస్ అప్లికేషన్' ద్వారా యూజర్స్ 2,000గంటలు పాటు వీడియో, మూవీస్, ట్రైలర్స్, టివిషోస్, మ్యూజిక్ వీడియోలను చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న స్ట్రీమింగ్ చిన్నదిగా ఉండడమే కాకుండా యాడ్స్‌ ఎక్కవ స్పేస్‌ని ఆక్రమించడం జరిగింది. రాబోయే అప్లికేషన్‌లో మాత్రం యూజర్స్ బిగ్ ఫిక్స్ ద్వారా లోపలికి ప్రవేశించి, 1,000 వరకు పూర్తి నిడివి కలిగిన సినిమాలను, వీటిల్లో 500 వరకు హైడెఫినేషన్‌ని సపోర్ట్ చేస్తాయని రంజిత్ యాదవ్( శాంసంగ్ మొబైల్ & ఐటి, ఇండియా) తెలిపారు.

అంతేకాకుండా ఈ 'మై మూవిస్ అప్లికేషన్' ని శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్స్ శాంసంగ్ ఉత్ప్తతులు ఉండేటటువంటి అనుభూతిని పొందుతారని అన్నారు. ఈ అప్లికేషన్స్ ద్వారా యూజర్స్‌కు క్వాలిటీ కంటెంట్‌‍ అందజేస్తున్నామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot