టీజర్ చూసి ఫ్యాన్స్ షేక్!!

Posted By: Super

టీజర్ చూసి ఫ్యాన్స్ షేక్!!

 

శామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలక్సీ ఎస్3కు ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. మే3న ఈ డివైజ్‌ను లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఈ సరికొత్త గ్యాడ్జెట్‌కు సంబంధించి టీజర్ వెబ్‌సైట్‌ను శామ్‌సంగ్ లాంఛ్ చేసింది. ఔత్సాహికులు www.tgeltaayehxnx.comలోకి లాగినై టీజర్‌ను వీక్షించచ్చు. “The Next Galaxy” అనే పదాలకు అడ్డదిడ్డంగా రూపొందించబడిన పేరే tgeltaayehxnx. వేడకకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో శామ్‌సంగ్ వర్గాలు ఏర్పాట్లలో తనమునకలయ్యాయి. కార్యక్రమానికి సంబంధించి, ఇప్పటికే పలు మీడియా సంస్థలకు ఆహ్వాన పత్రాలు అందినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గెలక్సీ ఎస్3 ఆవిష్కరణ కార్యక్రమంలో 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని శామ్‌సంగ్ పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆధారితంగా ఈ టాబ్లెట్ రన్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గెలక్సీ ఎస్3 ఫీచర్లను పరిశీలిస్తే ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.6 అంగుళాల ఆమోల్డ్ హై డెఫినిషన్ స్ర్కీన్, 12 మెగా పిక్సల్ కెమెరా, ఎల్‌టీఈ కనెక్టువిటీ, ఎన్ఎఫ్‌సీ నెట్‌వర్క్ సపోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot