60% వాటా పై పాపులర్ హిరో గురి!!

Posted By: Super

60% వాటా పై పాపులర్ హిరో గురి!!

 

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ శామ్‌సంగ్ 2012 ఆర్ధిక సంవత్సరంలో 60 శాతం మార్కెట్ వాటా సాధించే దిశగా ప్రణాళిక రూపొందించిందని ఆ కంపెనీ మొబైల్ ఐటి విభాగం అధ్యక్షుడు రంజిత్ యాదవ్ ప్రకటించారు. వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం మార్కెట్లోకి మరో రెండు మోడళ్లు గెలక్సీ ఎస్ అడ్వాన్స్, గెలక్సీ పాకెట్‌ను విడుదలచేసింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ మొబైల్ ఐటీ విభాగం అధ్యక్షుడు రంజిత్ యాదవ్ మాట్లాడుతూ కంపెనీ ఆఫర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ల సంఖ్య 19కి చేరుకుందని అన్నారు. రూ.7,350 మొదలు రూ.38,250 వరకు వివిధ ధరల్లో వీటిని అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 44.7 శాతం వాటా ఉంది.

గెలక్సీ పాకెట్ ఫీచర్లు:

* 2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320 పిక్సల్స్),

* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* 3జీ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ, ఎడ్జ్ మరియు జీపీఆర్ఎస్ వ్యవస్ధల సపోర్ట్,

* బ్లూటూత్ 3.0, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సౌలభ్యత, హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రౌజర్,

* ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* సింగిల్ కోర్ 832 మెగాహెడ్జ్ ప్రాసెసర్,

* నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ HSDPA 900 /2100),

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

* ధర రూ.8,150.

గెలక్సీ ఎస్ ఆడ్వాన్స్:

4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

768ఎంబీ ర్యామ్,

5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

బ్యాటరీ టాక్ టైమ్ 7.5 గంటలు,

ధర రూ.26,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot