మార్కెట్లోకి శ్యామ్‌సంగ్ కొత్త నోట్‌బుక్ ఎన్ 100

Posted By: Super

మార్కెట్లోకి శ్యామ్‌సంగ్ కొత్త నోట్‌బుక్ ఎన్ 100

ప్రతి ఒక్కరూ కంప్యూటర్ గురించి ఆలోచించే రోజులు వచ్చాయి. అందుకు కారణం కంప్యూటర్స్ ధరలు బాగా తగ్గపోవడమే. ఇది మాత్రమే కాదండోయ్. గతంలో లాప్ టాప్స్ ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో అందరూ డెస్క్ టాప్స్ పైనే శ్రద్ద ఎక్కవగా చూపించేవారు. కానీ రోజులు మారాయండీ. దీనితోపాటు టెక్నాలజీ, ప్రాసెసర్స్ కూడా మారాయి. రోజురోజుకీ మార్కెట్లో పెరుగుతున్న కాంపిటేషన్‌ని దృష్టిలో పెట్టుకోని కంప్యూటర్ తయారీదారులు కూడా వారియొక్క కంప్యూటర్ రేట్లను తగ్గిస్తున్నారు. ఇప్పుడు రూ 15000లకే మార్కెట్లో లాప్ టాప్స్ లభ్యమవుతున్న విషయం తెలిసిందే.

మార్కెట్లో నోట్ బుక్స్, టాబ్లెట్ పిసిలకు మంచి గిరాకీ ఉంది. అందుకు కారణం నోట్ బుక్స్ అనేవి చిన్న లాప్ టాప్స్‌గా ఉండి, ఇంటర్నెట్‌ని వాడేందుకు చాలా ఈజీగా ఉండి, తక్కువ మందం కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఈ నోట్ బుక్ ట్రెండ్‌‌ని క్యాష్ చేసుకునేందుకుగాను శ్యామ్ సంగ్ కంపెనీ శ్యామ్ సంగ్ ఎన్100 అనే లాప్ ట్యాప్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ లాప్ ట్యాప్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీని బరువు కేవలం 1.03 KG మాత్రమే. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కడికి వెల్లినా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.

గతంలో శ్యామ్ సంగ్ విడుదల చేసిన శ్యామ్ సంగ్ ఎన్ 150పి మాదిరే శ్యామ్ సంగ్ ఎన్ 100 కూడా ఉంటుంది. శ్యామ్ సంగ్ ఎన్150పి గ్లోబల్‌గా 3మిలియన్ యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం జరిగింది. రంజిత్ యాదవ్( హెడ్ శ్యామ్ సంగ్ మొబైల్ అండ్ ఐటి, ఇండియా) మాట్లాడుతూ మార్కెట్లోకి విడుదల చేయనున్న శ్యామ్ సంగ్ ఎన్ 100 కస్టమర్స్‌ని తప్పకుండా ఆకట్టుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేము మా కస్టమర్స్ కోసం హై క్వాలిటీ, ఫెర్పామెన్స్ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా రూపోందిచడం జరిగిందని తెలియజేశారు.

శ్యామ్‌సంగ్ ఎన్ 100 స్క్రీన్ డిస్ ప్లే సైజు విషయానికి వస్తే యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం 10.1 ఇంచ్‍‌గా రూపోందించడం జరిగింది. ఇందులో 1GB of DDR3 RAMతో పాటు ఇంటర్నల్ గ్రాఫిక్స్‌ని కలిగి ఉండి, 250 GB hardisk దీని ప్రత్యేకత. ఈ లాప్ ట్యాప్‌తో పాటు డిఫాల్ట్‌గా ఇంటెల్ మీగో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇనిస్టాల్ ఉన్నప్పటికీ మరో ప్రీమియమ్ ఆఫ్షన్‌గా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ని కూడా ఇవ్వడం జరిగింది. శ్యామ్ సంగ్ ఎన్ 100 నోట్ బుక్ ప్రస్తుతం మార్కెట్లో 8 రకాలలో లభ్యమవుతుంది. ఇక ధర విషయానికి వస్తే రూ 12.290 నుండి రూ 21,990గా నిర్ణయించమైంది. ఆగస్టు చివరికల్లా ఇండియన్ పిసి మార్కెట్లోకి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot