కాంభినేషన్ అదుర్స్ !!

Posted By: Super

కాంభినేషన్ అదుర్స్ !!

 

అవును 2012కు గాను శామ్‌సంగ్ విండోస్ కాంభినేషన్ లో మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. ఇదేంటి శామ్‌సంగ్ ఎప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లనే ఎంచుకుంటుంది కదా ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా..? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలకు మార్కెట్లో పెరగుతున్న ఆదరణను పరిగణలోకి తీసుకుని శామ్‌సంగ్ ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం. విడుదల కాబోతున్న మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒక మోడల్‌కు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పేరు: శామ్‌సంగ్ మండెల్ ఎస్‌జీహెచ్ -ఐ667,

డిస్‌ప్లే: WVGA,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ ఫోన్ ట్యాంగో (విండోస్ ఫోన్ 7.5 రిఫ్రెష్),

కనెక్టువిటీ: ఎల్‌టీఈ.

తక్కిన రెండు మోడల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వీటిలో విండోస్ ఫోన్ అపోలో ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చేసినట్లు సమచారం. 2012 చివరిలో వీటిని లాంఛ్ చేసే అవకాశముంది. గమనించినట్లయితే ఇప్పటి వరకు నోకియా మాత్రమే విండోస్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ వరసలో శామ్‌సంగ్ వచ్చి చేరింది. చూద్దాం విండోస్ వోఎస్‌ల స్థాయి ఏ మేరకు పెరుగుతుందో..!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot