Home
Mobile

ఈ ఏడాది ఆ మూడేనా..?

By Super
Samsung launching 3 Windows Phone handsets in 2012


అవును 2012కు గాను శామ్‌సంగ్ మూడు సరికొత్త విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టనుంది. ఇదేంటి శామ్‌సంగ్ ఎప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లనే ఎంచుకుంటుంది కదా ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా..? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలకు మార్కెట్లో పెరగుతున్న ఆదరణను పరిగణలోకి తీసుకుని శామ్‌సంగ్ ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం. విడుదల కాబోతున్న మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒక మోడల్‌కు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పేరు: శామ్‌సంగ్ మండెల్ ఎస్‌జీహెచ్ -ఐ667,

డిస్‌ప్లే: WVGA,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ ఫోన్ ట్యాంగో (విండోస్ ఫోన్ 7.5 రిఫ్రెష్),

కనెక్టువిటీ: ఎల్‌టీఈ.

తక్కిన రెండు మోడల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వీటిలో విండోస్ ఫోన్ అపోలో ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చేసినట్లు సమచారం. 2012 చివరిలో వీటిని లాంఛ్ చేసే అవకాశముంది.

గమనించినట్లయితే ఇప్పటి వరకు నోకియా మాత్రమే విండోస్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ వరసలో శామ్‌సంగ్ వచ్చి చేరింది. చూద్దాం విండోస్ వోఎస్‌ల స్థాయి ఏ మేరకు పెరుగుతుందో..!!

విండోస్ ఆపరేటింగ్ సిస్టం విశిష్టతలు:

ఆపరేటింగ్ సిస్టంలలో విండోస్ ఫోన్ 7 వోస్ ఉత్తమమైనది… ఈ వోఎస్‌తో రూపుదిద్దుకున్న హ్యాండ్‌సెట్‌లు కొత్తదనం కోరుకునే వారికి కేర్ ఆఫ్ అడ్రస్.. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో సుసంపన్నమైన ఈ సాప్ట్‌వేర్ హై క్వాలిటీ మల్టీమీడియా అనుభూతిని కలిగిస్తుంది.

ఈ వోఎస్ అందిస్తున్న పలు ముఖ్య ఫీచర్లు:

గెస్ట్‌ మోడ్: ఈ ఫోన్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా పదిలపరుచుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పర్సనల్ డేటాకు పూర్తిస్ధాయి భద్రతను కల్పిస్తుంది. వివిధ సందర్భాల్లో మీ హ్యాండ్‌సెట్‌ను మిత్రులు లేదా ఇతర వ్యక్తులు ఆపరేట్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో మీ ఈ-మెయిల్స్ అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల అపడేట్స్‌ను వారి కంట పడకుండా పదిల పరుస్తుంది.

యూజర్ ఇంటర్‌ఫేస్ కస్టమైజేషన్: ఈ అప్లికేషన్ ద్వారా ఫోన్ డిస్‌ప్లే బ్యాక్ గ్రౌండ్‌ను నచ్చిన రీతిలో మార్చుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫీచర్ సహకారంతో హ్యాండ్‌సెట్ రూపరేఖలు మీకు ఇష్టమొచ్చినట్లు మార్చుకోవచ్చు.

మీడియా ఫార్మాట్ సపోర్ట్: సాధారణంగా విండోస్ ఫోన్ అంటే వినియోగదారుడు హై క్వాలిటీ ఆడియో, వీడియో వ్యవస్థలను ఆశిస్తాడు. ఈ ఫీచర్ సౌలభ్యతను ఆస్వాదించే శ్రోత ఇది స్మార్ట్‌ఫోనా లేక పూర్తి‌స్ధాయి మల్టీ మీడియా ఫోనా అన్న భావనకు లోనవుతాడు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు, విండోస్ 7 ఫోన్‌లలో మీడియా ఫార్మాట్ వ్వవస్థ ఎంత మన్నికైనదో.

ఇవే కాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఈ విధమైన పటిష్టమైన వ్యవస్థతో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం ప్రపంచాన్ని శాసించనుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X