శాంసంగ్ సామాన్యుడి ఫోన్

Posted By: Staff

శాంసంగ్ సామాన్యుడి ఫోన్

వర్జిన్ మొబైల్ మార్కెట్లోకి ఎంతో ప్రతిష్టాత్మకంగా 'శాంసంగ్ ఎమ్575 ' మొబైల్‌ని విడుదల చేస్తుంది. ఈజీగా మెసెజ్‌లను టైపు చేసుకునేందుకు గాను క్వర్టీ కీప్యాడ్ ఇందులో ప్రత్యేకం. దీని ధర అమెరికాలో కేవలం $79.99 మాత్రమే. ఇండియాలో త్వరలో విడుదల కానున్న ఈ మొబైల్ ధర చాలా తక్కవగా ఉండవొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌గా రూపొందించబడింది. ఇందులో ఉన్న 2.0 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో ఏవిధంగా(ortrait,landscape mode)కావాలంటే ఆ విధంగా పోటోలను తీయవచ్చు. వీడియో రికార్డింగ్‌ని కూడా స్పష్టంగా తీయవచ్చు. మొబైల్‌తో పాటు మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

కనెక్టివిటీ ఫీచర్ అయిన బ్లూటూత్‌ని సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఇందులో మ్యూజిక్ ప్లేయర్ ప్రత్యేకం. మార్కెట్లో లభించే ఎమ్‌పి3, ఎమ్‌పి4 ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను, మొబైల్‌లో A-GPS ఫంక్షనాలిటీ ఉంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్ర్తత్యేకం. మొబైల్‌తో పాటు అలారమ్, క్యాలెండర్, క్యాలుక్లేటర్ లాంటి ఫీచర్స్ ప్రత్యేకం.

బ్యాటరీ బ్యాక్‌అప్ ఎక్కువ కాలం మన్నేందుకు గాను ఇందులో 1160 mAh lithium-ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. 6గంటలు టాక్ టైమ్, 288 గంటలు స్టాండ్ బై టైమ్. ఇండియాలో దీని ధరను ఇంకా వెల్లడించ లేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot