శ్యామ్‌సంగ్ అదిరిపోయే ఆఫర్..

Posted By: Super

శ్యామ్‌సంగ్ అదిరిపోయే ఆఫర్..

ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని గ్లోబల్‌గా టచ్ స్క్రీన్ మొబైల్స్ ఏలుతున్న విషయం తెలిసిందే. యూజర్స్ కూడా టచ్ స్క్రీన్ మొబైల్స్‌కి ఎంత ఎక్కువ డబ్బుఅయినా చెల్లించి సొంతం చేసుకొవాలనే యోచనలో ఉన్నారు. అందుకు కారణం టచ్ స్క్రీన్ మొబైల్స్ చేతిలో ఉంటే మన స్టేటస్ ఇట్టే తెలిసిపోతుందని వారి నమ్మకం. సరిగ్గా ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని శ్యామ్‌సంగ్ కొత్తగా మొబైల్ ప్రపంచంలోకి కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తుంది.

ఈ సిరిస్‌కి శ్యామ్‌సంగ్ పెట్టిన పేరు 'శ్యామ్‌సంగ్ ఛాంప్ మెగాకామ్'. ఈ విభాగంలో శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న మొబైల్ ఫోన్ శ్యామ్‌సంగ్ జిటి-సి3303ఐ. శ్యామ్‌సంగ్ జిటి-సి3303ఐ మొబైల్ మల్టీ టచ్ స్క్రీన్‌తో రూపొందించడం వల్ల యూజర్స్‌ని ఇట్టే ఆకర్షణకు గురి చేస్తుంది. చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ అందించడంతో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 320 x 240 ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది.

శ్యామ్‌సంగ్ జిటి-సి3303ఐ మొబైల్‌లో 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. సాధారణ కెమెరాలతో పొల్చితే ఈ మొబైల్ కెమెరా వంద శాతం ఉత్తమమైనదిగా భావిస్తున్నారు. ఈ కెమెరాకున్న మరో విశిష్టత ఏమిటంటే నైట్ మోడ్‌తో పాటు మల్టీ షార్ట్ మోడ్‌ని సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో టైమర్ షాట్, ఫ్రేమ్ షాట్ లను కూడా తీయవచ్చు.

ఈ మొబైల్‌ని రూపొందించేటప్పుడు ఇందులో TouchWiz Lite 2.0 UIతో తయారు చేయడం జరిగింది. శ్యామ్‌సంగ్ ఛాంప్ మెగాకామ్ మొబైల్స్ లలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్, మైస్పేస్ లాంటి వాటిని చాలా ఈజీగా కనెక్ట్ అవ్వవచ్చు. మొబైల్‌తో పాటు 30 MB లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది.

శ్యామ్‌సంగ్ జిటి-సి3303ఐ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

* Touchwiz Lite 2.0 User Interface
* 2.4” inch Touchscreen with Samsung Apps
* Stylish, Beautiful and comfortable to use
* Easily access 7 most popular social networking
* 2.4” inch (320

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot