చక్కని ఫీచర్స్‌‌తో శ్యామ్‌సంగ్ metro duos C3322

Posted By: Staff

చక్కని ఫీచర్స్‌‌తో శ్యామ్‌సంగ్ metro duos C3322

మొబైల్ తయారీదారు సంస్ధలలో ప్రపంచంలో శ్యామ్‌సంగ్ ఒకటి. ఇండియా, ప్రపంచంలో ఎక్కువ కస్టమర్స్‌ని పోంది ఉన్న మొబైల్ కంపెనీ. ఇటీవల కాలంలో ఎక్కువ హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్నటువంటి శ్యామ్‌సంగ్ కంపెనీలో అన్ని రకాల కస్టమర్స్‌కు అన్ని ధరలలో మొబైల్స్ లభిస్తాయి. ఇండియాలో ఉన్నటువంటి అన్ని సిటీలలోను, పట్టణాలలోను డీలర్స్, సర్వీస్ సెంటర్లను కలిగి ఉంది శ్యామ్‌సంగ్.

ఈరోజు శ్యామ్‌సంగ్ కంపెనీ రెండు మోడళ్ల ఫీచర్స్‌ని చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న శ్యామ్‌సంగ్ మెట్రో డ్యూస్ C3322, రెండవది శ్యామ్‌సంగ్ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న శ్యామ్‌సంగ్ Ch@t 222. రెండు మొబైల్స్ కూడా చూడడానికి చాలా చక్కగా, మంచి స్టయిల్‌గా ఉండడమే కాకుండా కామన్ మ్యాన్‌కి నచ్చే విధంగా రూపోందించబడ్డాయి. రెండు మొబైల్స్ కూడా 2.2 ఇంచ్ టిఎఫ్‌టి డిప్లే సైజు కలిగి ఉండి చూడడానికి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలగజేస్తుంది.

స్క్రీన్ రిజల్యూషన్‌లో చాలా చక్కగా ఉన్నప్పటికీ, వీడియో ప్లేబ్యాక్‌కి కూడా చాలా చక్కగా పని చేస్తుంది. శ్యామ్‌సంగ్ మెట్లోడ్యూస్ C3322, Ch@t 222 రెండు కూడా మల్టీమీడియాని సపోర్ట్ చేస్తాయి. మంచి క్వాలిటీ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో లౌడ్ స్పీకర్స్ కూడా అమర్చడం జరిగింది. వీటితోపాటు ఎప్ఎమ్ రేడియో, 3.5mm యూనివర్సల్ ఆడియో జాక్ ఉండడంతో ఎప్పుడైనా బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా పర్సనల్‌గా మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్‌ని గనుక పోందాలంటే హెడ్ ఫోన్స్ ఉపయోగించవచ్చు.

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఉన్న లెటేస్ట్ కొత్త టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఆప్షన్స్ అన్నింటిని కూడా రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి జిపిఆర్‌ఎస్‌లతో పాటు ఎడ్జి కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్‌ని సోపర్ట్‌ చేస్తాయి. Ch@t 222లో మెసేజిలు, టెక్ట్స్ లను పంపుకోవడానికి కీ ప్యాడ్ చాలా చక్కగా సహాకరిస్తుంది. Metro Duos C3322లో ఉండే సౌండ్ క్వాలిటీ కస్టమర్స్‌కి మంచి చక్కటి మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది.

రెండు మొబైల్స్ కూడా జావా ని సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల జావాకి సంబంధించిన అన్ని రకాల గేమ్స్‌ని డౌన్ లోడ్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. ఇక Ch@t 222 ఖరీదు విషయానికి వస్తే రూ 3500 కాగా, అదే శ్యామ్‌సంగ్ Metro Duos C3322 మాత్రం రూ 3800గా నిర్ణయించడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting