శ్యామ్‌సంగ్ స్లైడర్ ఫోన్ 2,500కే.. నెట్ బ్రౌజింగ్ సూపర్!

Posted By: Prashanth

శ్యామ్‌సంగ్ స్లైడర్ ఫోన్ 2,500కే.. నెట్ బ్రౌజింగ్ సూపర్!

 

వివిధ మార్కెట్ సెగ్మంట్‌ల పై దృష్టి సారించిన శ్యామ్‌సంగ్ తక్కువ ఖరీదుకే మన్నికైన మొబైల్ ఫోన్‌లను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో స్టాండర్డ్ అదేవిధంగా ఆడ్వాన్సడ్ ఫీచర్లతో శ్యామ్‌సంగ్ E2600 మొబైల్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది. జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ వ్యవస్థను నిక్షిప్తం చేశారు. దోహదం చేసిన ఎడ్జ్ వ్యవస్థ నెట్ బ్రౌజింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను మొబైల్‌లో ప్రీలోడ్ చేశారు.

* శ్యామ్‌సంగ్ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,

* ఫోన్ డిస్‌ప్లే 2.4 అంగుళాలు (టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంటుంది),

* 2.0 మెగా పిక్సల్ కెమెరా,

* 40 ఎంబీ ఇంటర్నల్ మెమరీ,

* జీబి స్ధాయిని 16 స్థాయికి పెంచుకునే విధంగా మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్,

* ఫోన్ డేటాను వేగవంతంగా షేర్ చేసుకునేందుకు బ్లూటూత్ v3.0 A2DP,

* యూఎస్బీ 2.0 పోర్ట్ కనెక్టువిటీ,

ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థ అలాగే లోడ్ చేసిన గేమ్స్ అలుపెరగని వినోదాన్ని పంచుతాయి. మన్నికైన బ్యాకప్ నిచ్చే 800 mAh రిమూవబుల్ లితియయ్ ఐయాన్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో విడుదలకాబోతున్న శ్యామ్‌సంగ్ E2600 ధర రూ.2,500 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot