ఫోన్ నచ్చకుంటే 90 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు..?

వచ్చే వారం న్యూయార్క్‌లో లాంచ్ కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. గెలాక్సీ ఎస్8 అమ్మకాలను గణనీయంగా పెంచుకునే క్రమంలో సామ్‌సంగ్, 90 రోజుల రిటర్న్ పాలసీని తెరమీదకు తీసుకురాబోతున్నట్లు రూమర్ మిల్స్ కోడై కూస్తున్నాయి.

Read More : ఫోన్‌లో డిలీట్ అయిన ఫోటోలను రికవర్ చేసేందుకు బెస్ట్ యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరైన కారణాన్ని చూపించి ..

ఒకవేళ, సామ్‌సంగ్ ఈ రకమైన మార్కెటింగ్ విధానానికి శ్రీకారం చుట్టినట్లయితే ఫోన్ కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు సరైన కారణాన్ని చూపించి ఫోన్‌ను రిటర్న్ చేసే వీలుంటుంది.

అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..?

ఈ విధమైన మార్కెటింగ్ ఎత్తుగడ గెలాక్సీ ఎస్8కు మాత్రమే పరిమితామా..? లేక అన్ని సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ ల పై కూడా వర్తిస్తుందా అన్నదాని పై కూడా స్పష్టత లేదు.

గెలాక్సీ నోట్ 7 డిజాస్టర్ అయిన నేపథ్యంలో..

గెలాక్సీ నోట్ 7 ఫోన్ వేల కోట్ల నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్8 విషయంలో సామ్‌సంగ్ మరింతగా ఆచితూచి స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

SM-G950 కోడ్ నేమ్‌తో...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన Exynos 8895 చిప్‌సెట్ రికార్డు స్కోరును నమోదు చేసినట్లు తెలుస్తోంది. SM-G950 కోడ్ నేమ్‌తో విడుదల కాబోతోన్న గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ 205,284 పాయింట్లను స్కోర్ చేసినట్లు ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ Antutu ధృవీకరించింది.

QHD(4K) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

బ్రాండ్ న్యూ లుక్, QHD(4K) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, సూపీరియర్ క్వాలిటీ కెమెరాతో పాటు పులు విప్తవాత్మక ఫీచర్లు గెలాక్సీ ఎస్8 ఫోన్‌ను మరోసారి మార్కెట్ లీడర్‌గా నిలబెట్టబోతున్నట్లు మార్కెట్ వర్గాల టాక్.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung might offer 3-month return policy for Galaxy S8. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot