షాక్.. శాంసంగ్ ఆ ఫోన్లను రీకాల్ చేస్తోంది

By Hazarath
|

శాంసంగ్‌కు మరో దిమ్మతిరిగే షాక్ ఎదురవుతోంది. ఈ మధ్య లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ నోట్ స్మార్ట్‌ఫోన్లు ఛార్జింగ్ పెడుతున్న సమయంలొ పేలిపోతున్నాయనకి కష్టమర్ల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి.దెబ్బతో బిత్తరపోయిన శాంసంగ్ ఈ మోడల్ ఫోన్లన్నింటినీ రీకాల్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శాంసంగ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

అమ్మకాల సునామిలో గెలాక్సి నోట్ 7..సప్లయిలేక శాంసంగ్ విలవిల

samsung

కష్టమర్ల భద్రత మాకు చాలా ముఖ్యం. శాంసంగ్ పై ఎంతో నమ్మకముంచి ఫోన్లు కొనుగోలు చేసినవారికి ఎలాంటి ఇబ్బంది రానివ్వమని ఈ ఫోన్లన్నీ రీకాల్ చేస్తామని ఆయన చెప్పారు. అయితే గెలాక్సీ 7 నోట్ లు పేలుతున్నాయన్న వార్త సంస్థ ఈక్విటీపైనా తీవ్ర ప్రభావం చూపింది. మొత్తం షిప్పింగ్ చేసిన ఫోన్లలో 0.1 శాతం యూనిట్లలో మాత్రమే సమస్యలకు ఆస్కారముందని శాంసంగ్ మరో అధికారి తెలిపారు. కాగా, ఈ ఫోన్ గత నెల 10 వ తేదీన మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మార్కెట్లో దీని ధర రూ. 59,990గా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

#1

#1

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 లో 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 2560 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను డిస్‌ప్లేకు ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా కర్వ్డ్ ఎడ్జ్‌లను కలిగి ఉంది.

#2

#2

డివైస్ డిస్ప్లేకు రెండు వైపులా కర్వ్లు ఉంటాయి. డివైస్ డిస్‌ప్లేపై భాగంలో ఐరిస్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ఇయర్ ఫోన్ స్లాట్‌ను పై భాగంలో ఇచ్చారు. డిస్‌ప్లే కింది భాగంలో హోమ్ కీ ఉంది. దీంట్లోనే ఫింగర్ప్రింట్ స్కానర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

#3

#3

డివైస్ కు అన్ని వైపులా పూర్తిగా అల్యూమినియంతో తయారు చేసిన ఫ్రేమ్స్ ను పొందు పరిచారు. పవర్ బటన్ డివైస్ కు కుడి భాగంలో ఉంది. కింది భాగంలో యూఎస్బీ టైప్-సి పోర్ట్ను ఇచ్చారు.

#4

#4

ఇది యూఎస్బీ 3.1 వెర్షన్ను సపోర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్ ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 3500 ఎంఏహెచ్ బ్యాటరీని, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్తో ఇందులో ఏర్పాటు చేశారు. వైర్లెస్ రూపంలోనూ డివైస్ను చార్జింగ్ పెట్టుకోవచ్చు.

#5

#5

12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ఉన్నాయి. ఫోన్తోపాటు ఎస్-పెన్ స్టైలస్ను ఇస్తున్నారు. డివైస్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ను కలిగి ఉంది.

#6

#6

ఆక్టాకోర్ ఎగ్జినోస్ 8890 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4 జీ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎల్ఈ, ఎన్ఎఫ్సీ వంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్లో ఉన్నాయి.

#7

#7

బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్ వ్యవస్థను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా సామ్‌సంగ్ పే ఇంకా ఇతర్ యాప్స్ ద్వారా చేసే కొనుగోళ్లకు సంబంధించి చెల్లించే పేమెంట్స్ మరింత సెక్యూర్‌గా ఉంటాయి.

#8

#8

ఆండ్రాయిడ్ మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ లేటెస్ట్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్. త్వరలోనే ఆండ్రాయిడ్ 7.0 Nougat అప్‌డేట్ పొందే అవకాశం కూడా ఉంది.

#9

#9

హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారో మీటర్, స్ర్కీన్ ఆఫ్ మెమో, స్మార్ట్ సెలక్ట్, సరికొత్త ఎయిర్ కమాండ్ ఫంక్షన్స్. హార్ట్రేట్ను, డైలీ యాక్టివిటీలను, నిద్రను సులభంగా ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అంతేకాకుండా బారోమీటర్ సహాయంతో వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

#10

#10

ముందుగా ఆర్డర్ చేసిన వారికి సెప్టెంబర్ 2 అంటే ఈ రోజు నుంచి ఫోన్లు డెలివరీ కానున్నాయి. గోల్డ్ ప్లాటినం, సిల్వర్ టైటానియం, బ్లాక్ ఓనిక్స్ రంగుల్లో ఫోన్ లభిస్తోంది. ప్రీ ఆర్డర్ చేసిన యూజర్లకు రూ .7290 విలువ గల గేర్ వీఆర్ హెడ్సెట్ను రూ .1990 ధరకే అందించనున్నారు.

Best Mobiles in India

English summary
Here Write Samsung mobile recovery suffers blow as Galaxy Notes 'catch fire'

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X