సామ్‌సంగ్ స్పెషల్ ఆఫర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే

కొద్ది రోజుల క్రితం యాపిల్ ఐఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా సామ్‌సంగ్ ఫోన్‌ల పై డిస్కౌంట్‌లకు తెరలేపింది. సామ్‌సంగ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న స్పెషల్ సేల్‌లో భాగంగా గెలాక్సీ ఆన్ నెక్స్ట్, గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్7, గెలాక్సీ జే5 (2016), గెలాక్సీ ఏ9 ప్రో, గెలాక్సీ సీ9 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.3,000 వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Read More : బీఎస్ఎన్ఎల్ 100జీబి ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

No cost EMI సదుపాయం..

వీటిలో కొన్ని ఫోన్‌ల పై స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్‌తో పాటు No cost EMI ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది.

Galaxy On Nxt పై

సామ్‌సంగ్ మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా రూ.18,490 ఖరీదు చేసే Galaxy On Nxt ఫోన్‌ను రూ.15,900కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై రూ.2,590 తగ్గింపు లభిస్తుంది. ఇ

గెలాక్సీ ఆన్7, గెలాక్సీ ఆన్8

ఇదే మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా గెలాక్సీ ఆన్ 8 పై రూ.2000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్‌ పోనూ రూ.13,000కే గెలాక్సీ ఆన్8ను కొనుగోలు చేయవచ్చు. మరో ఫోన్ గెలాక్సీ ఆన్7 పై రూ.1700 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. డిస్కౌంట్‌ పోనూ రూ.8,490కే ఈ ఫోన్ మీ సొంతమవుతుంది.

గెలాక్సీ జే5 (2016) మోడల్ పై

మరో ఫోన్ గెలాక్సీ జే5 (2016) మోడల్ పై రూ.2,300 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. డిస్కౌంట్‌ పోనూ రూ.10,990కే ఈ ఫోన్ మీ సొంతమవుతుంది.

గెలాక్సీ సీ9 ప్రో పై...

గెలాక్సీ ఏ9 ప్రో పై రూ.16,000 వరకు ఎక్స్‌ఛేంజ్ స్కీమ్స్ అలానే డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అన్ని రాయితీలు పోనూ రూ.29,900కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు . No cost EMI సదుపాయాన్ని కూడా ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది. మరో ఫోన్ గెలాక్సీ సీ9 ప్రో పై కూడా రూ.16,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. 

సామ్‌‌సంగ్ గేర్ ఫిట్ 2 పై...

సామ్‌సంగ్ మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా వేరబుల్స్ పైనా సామ్‌సంగ్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. సామ్‌‌సంగ్ గేర్ ఫిట్ 2 పై ఏకంగా రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్ ను సామ్ సంగ్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్‌ పోనూ రూ.11,990కే ఈ బ్యాండ్ మీ సొంతమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
samsung Mobiles Fest on Flipkart: Deals on Samsung Galaxy On Nxt, Galaxy A9 Pro, Gear Fit2 and more. Read More in Telugu Gizbot5..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot