భారీగా తగ్గిన Galaxy Note 8 ధర

Written By:

దక్షిణకొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 8 ధరను తగ్గించింది. ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 మేర ధరను తగ్గిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.67,900 కాగ, ధర తగ్గింపు అనంతరం గెలాక్సీ నోట్‌ 8 రూ.64,900కు అందుబాటులోకి వచ్చింది.

వొడాఫోన్ నుంచి అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

కార్డుహోల్డర్స్‌కు రూ.4000 క్యాష్‌బ్యాక్‌ ..

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుహోల్డర్స్‌కు రూ.4000 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో పాటు గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై 1000 రూపాయల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.

అమెజాన్‌ ఇండియాలో..

 అమెజాన్‌ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది.

అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌

కాగా భారత్‌లో ఇప్పటి వరకు శాంసంగ్‌ లాంచ్‌ చేసిన అన్ని ఫోన్లలో గెలాక్సీ నోట్‌ 8 మాత్రమే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung most expensive smartphone gets a price cut in India More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot