శ్యామ్‌సంగ్ కొత్త జనరేషన్ ఫోన్.. ఆపిల్‌కి భయం

Posted By: Staff

శ్యామ్‌సంగ్ కొత్త జనరేషన్ ఫోన్.. ఆపిల్‌కి భయం

మొబైల్ గెయింట్ శ్యామ్‌సంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్లో కొత్త హై ఎండ్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తూ తన గుత్తాధిపత్యాన్ని చాటుకొవాలని ప్రయత్నిస్తుంది. స్వతహాగా కొరియా కంపెనీ అయిన శ్యామ్‌సంగ్ మార్కెట్లో గెలాక్సీ ఎస్2 మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసి సక్సెస్ సాధించి యావత్ ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించుకునేలా చేసుకుంది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్ తయారీదారులకు మింగుడు పడని విషయం.

ప్రస్తుతం మార్కెట్లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2కి హై డిమాండ్ ఉన్నప్పటికీ త్వరలో మరొ కొత్త గెలాక్సీ సిరిస్ మొబైల్‌ని మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. త్వరలో శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న ఈ మొబైల్ గెలాక్సీ సిరిస్‌లో మూడవ జనరేషన్ ఫోన్. దాని పేరు 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3'. ఈ మొబైల్ గనుక మార్కెట్లోకి విడుదలైతే పరిస్దితే మారిపోతుందని నిపుణులు అభిప్రాయాన్ని తెలియజేశారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరిస్‌లో విడుదలైన శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 మొబైల్ విడుదలైన 55రోజుల్లోనే 3మిలియన్ డివైజెస్ అమ్మకాలను నమోదు చేయడం జరిగింది.

శ్యామ్‌సంగ్ మొబైల్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ ఇటీవల మాట్లాడుతూ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌లో మూడవ జనరేషన్ మొబైల్ త్వరలోనే విడుదల కాబోతుందని అన్నారు. ఈ పయనం ఇంతటితో ఆగకుండా త్వరలోనే 4జీని సపోర్ట్ చేసే మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్స్ విషయానికి వస్తే 4.5 ఇంచ్ AMOLED టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుందని అన్నారు. మొబైల్ చూడడానికి చాలా స్లిమ్‌గా ఉండి 12 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంటుందని తెలిపారు.

ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే 4జీ టెక్నాలజీలో కొత్తగా వినిపిస్తున్న నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్‌ని(Near Field Communication)టెక్నాలజీని ఇందులో నిక్షిప్తం చేయడం జరగిందని తెలియజేశారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వీటితో పాటు ఇందులో సిపియు ప్రాసెసర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో రూపోందించడం జరిగిందని సమాచారం. గెలాక్సీ అభిమానులు ప్రత్యేకంగా ఈ మొబైల్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల శ్యామ్‌సంగ్ మొబైల్స్ తమ ఉత్పత్తులను కాపీ కొడుతుందంటూ ఈ రెండింటి మద్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అందుకే కాబోలు ఆపిల్ కంపెనీ శ్యామ్‌సంగ్ ఉత్పత్తులను అమెరికా, యూరోపియన్ మార్కెట్లో విడుదల కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ శ్యామ్ సంగ్ మాత్రం తన కొత్త ఐడియాలతో అలా దూసుకుపోతూనే ఉంది. మార్కెట్లోకి శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ధర అధికారకంగా వెలువడలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot