రికార్డు స్థాయిలో శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అమ్మకాలు

|

శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 1 మిలియన్ యూనిట్ల అమ్మకాల గణాంకాలను సాధించిందని దక్షిణ కొరియా సంస్థ వెల్లడించింది. మొదటగా శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ MWC 2019 లో ప్రవేశపెట్టింది. ప్రారంబంలో ఇది డిస్ప్లే విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొనడంతో అనేక వివాదాలలో చిక్కుకున్నది.

డిస్ప్లే

మొదట పేలవమైన ఫోల్డబుల్ డిస్ప్లే సమీక్షకుల చేతుల్లో విరిగింది. తరువాత అది శామ్సంగ్ డ్రాయింగ్ బోర్డ్‌కు తిరిగి వెళ్లి ఫోన్ యొక్క రూపకల్పనను మరింతగా మెరుగుపరచుకొని సెప్టెంబరులో తిరిగి విడుదల చేసింది. టెక్ క్రంచ్ యొక్క డిస్ట్రప్ట్ బెర్లిన్ కార్యక్రమంలో దీని యొక్క తాజా అమ్మకాల గణాంకాలను ప్రకటించారు.

 శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్

అక్టోబరులో పెగ్డ్ అమ్మకాలు 500,000 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే కంపెనీ అదే మొత్తాన్ని కేవలం ఒక నెలలోపు అమ్మగలిగింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ యంగ్ సోహ్న్ ఈ కార్యక్రమంలో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ యొక్క 1 మిలియన్ యూనిట్లను విక్రయించగలిగిందని వెల్లడించారు.

 

లాంగ్ టర్మ్ ప్యాక్‌లను తొలగించిన DTH ఆపరేటర్లులాంగ్ టర్మ్ ప్యాక్‌లను తొలగించిన DTH ఆపరేటర్లు

 టెక్ క్రంచ్

ప్రారంభంలో ఈ సంఖ్య ప్రశంసనీయం. ముఖ్యంగా $1,980 (సుమారు రూ. 1,41,700, ఇండియాలో అయితే దీని ధర రూ.1,64,999). ఈ ఉత్పత్తులను ప్రస్తుతానికి ఒక మిలియన్ యూనిట్లను అమ్మగలిగారు. ఈ ఉత్పత్తిని $ 2,000 ధర వద్ద ఉపయోగించాలనుకునే చాలా మంది మిలియన్ల సంఖ్యలో ఇంకా ఉన్నారు అని సోహ్న్ టెక్ క్రంచ్ కార్యక్రమంలో నివేదించింది.

 తదుపరి గెలాక్సీ ఫోల్డ్

శామ్సంగ్ ఇప్పటికే తన తదుపరి గెలాక్సీ ఫోల్డ్ పరికరంను తయారుచేస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 18 న శాన్ ఫ్రాన్ సిస్కోలో జరిగే కార్యక్రమంలో దీనిని ప్రారంభించనున్నట్లు పుకారు ఉంది. నెక్స్ట్-జెన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ క్లామ్‌షెల్ లాంటి డిజైన్‌ను కలిగి ఉండి నిలువు పద్ధతిలో ఫోల్డ్ చేయగల డిజైన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ధర $ 1,000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. గత నెలలో ప్రారంభించిన మోటరోలా రజర్ (2019) లో ఇలాంటి డిజైన్ ఉంది.

 

ఆన్ లైన్ పరిచయాలతో 73 లక్షలు టోకరా ! మీరూ మోసపోవచ్చు జాగ్రత్తఆన్ లైన్ పరిచయాలతో 73 లక్షలు టోకరా ! మీరూ మోసపోవచ్చు జాగ్రత్త

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ రెండు డిస్ప్లేలను కలిగి ఉంది. ఇందులో ఒకటి ఫ్లాట్ స్క్రీన్ ముందు భాగంలో ఉంది. మరొకటి లోపల స్క్రీన్‌తో మడతపెట్టే డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ డిస్‌ప్లేలో హెచ్‌డి + (840x1960 పిక్సెల్స్) రిజల్యూషన్స్, 21: 9 కారక నిష్పత్తితో 4.6-అంగుళాల సూపర్ అమోలెడ్ ప్యానెల్ తో వస్తుంది. మరోవైపు ఫోల్డబుల్ డిస్ప్లే 7.3-అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలేడ్ ప్యానెల్ ను QXGA + (1536x2152 పిక్సెల్స్) రిజల్యూషన్‌ మద్దతుతో మరియు 4.2: 3 కారక నిష్పత్తితో వస్తుంది.

గెలాక్సీ ఫోల్డ్

గెలాక్సీ ఫోల్డ్ ఆండ్రాయిడ్ 9 పైని ట్వీక్డ్ వన్ యుఐ స్కిన్‌తో రన్ అవుతుంది. ఇది ఫోల్డబుల్ డిస్ప్లేలో యాప్ ల కొనసాగింపుకు మద్దతు ఇస్తుంది. ఇది 12GB RAM తో జతచేయబడి ఆక్టా-కోర్ SoC చేత పని చేస్తుంది. ఇందులో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇంకా అధిక మెమొరీ పొందడానికి ఇందులో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు.

 

బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్‌ను తొలగించించిన జియోబేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్‌ను తొలగించించిన జియో

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికొస్తే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు కవర్‌లో ఒకే సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో అల్ట్రా-వైడ్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో గల 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు డ్యూయల్ పిక్సెల్ AF లెన్స్‌తో గల 12 మెగాపిక్సెల్ సెన్సార్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇది OIS మరియు వేరియబుల్ ఎఫ్ / 1.5 నుండి ఎఫ్ / 2.4 ఎపర్చర్‌కు మద్దతు ఇస్తుంది. 12-మెగాపిక్సెల్ సెన్సార్ గల మూడవ కెమెరా టెలిఫోటో PDAF, OIS తో వస్తుంది. ఇది 2X ఆప్టికల్ జూమ్‌ను ప్రారంభించే f / 2.4 లెన్స్. మరోవైపు గల ఫ్రంట్ ఫేసింగ్ డ్యూయల్ కెమెరా సెటప్ 10 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.2 లెన్స్‌తో మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 1.9 లెన్స్‌తో RGB డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటాయి. ఫోన్ కవర్‌లో గల సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.2 లెన్స్‌తో 10 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Official Says The Brand Has Sold 1 Million Galaxy Fold Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X