శ్యామ్‌సంగ్ విండోస్ ఫోన్ ఓమ్నియా డబ్ల్యు

Posted By: Staff

శ్యామ్‌సంగ్ విండోస్ ఫోన్ ఓమ్నియా డబ్ల్యు

భారతదేశంలో నాణ్యమైన ఉత్పత్తులకు పెట్టింది పేరు శ్యామ్‌‌సంగ్. ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో దిట్ట. రాబోయే కాలంలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి శ్యామ్‌‌సంగ్ ఓ సరిక్రొత్త విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్‌ని విడుదల చేయనుంది. దానిపేరే 'శ్యామ్‌‌సంగ్ ఓమ్నియా డబ్ల్యు'. ఈ మొబైల్ విడుదల విషయాన్ని శ్యామ్‌‌సంగ్ ఇంతవరకు ధృవీకరించకపోయినప్పటికీ ఇంటర్నెట్లో అందిన సమాచారం మేరకు మేము అందిస్తున్నాం. శ్యామ్‌‌సంగ్ ఓమ్నియా డబ్ల్యు మొబైల్ 1.4 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండడంతో మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా ప్రదర్శించగలదు.

ఈ మొబైల్‌లో ఉన్న మరో విశిష్టత ఏమిటంటే (NFC Technology) నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌‌ని అందించేందుకు గాను 3.7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు, మల్టీ టచ్ ఫెసిలిటీని రూపోందించడం జరిగింది. ఇక సాప్ట్ వేర్ విషయానికి వస్తే విండోస్ ఫోన్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు, సింగిల్ కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. మొబైల్‌ పాటు 512 MB RAM లభిస్తుంది.

బెటర్ ఇమేజీ క్యాప్చరింగ్ ఫెసిలిటీ కోసం ఇందులో 5 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. చక్కని ఇమేజీలను, హై ఫెర్పామెన్స్ వీడియోలను తీయగలిగే కెమెరా దీని సొంతం. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని సపోర్ట్ చేయడం వల్ల ఇమేజీ క్వాలిటీ కూడా సూపర్బ్‌గా ఉంటుందని సమాచారం.

శ్యామ్‌‌సంగ్ ఓమ్నియా డబ్ల్యు స్పెషల్ ఫీచర్స్:

* Quad Band GSM, GPRS/EDGE
* 3G/WCDMA 2100 MHz
* HSUPA/HSDPA
* 3.7” inch (480

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting