శామ్‌సంగ్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. One UI 7 రిలీజ్ డేట్ ఫిక్స్!
టెక్ ప్రపంచంలో శామ్‌సంగ్ సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అదిరిపోయే టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు తీసుకొస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ బుధవారం సరికొత్త గెలాక్సీ S25 సిరీస్‌ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S25, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 15-బేస్డ్ One UI 7తో రానున్నాయి. అంటే, బాక్స్ నుంచి తీయగానే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
* One UI 7 అప్‌డేట్ ఎప్పుడంటే..
శామ్‌సంగ్ వన్ UI 7 అప్‌డేట్ విడుదల తేదీని కూడా ప్రకటించింది. గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లలో వన్ UI 7 స్టేబుల్ అప్‌డేట్ మొదటగా వస్తుంది. ఆ తర్వాత, మిగతా ఫోన్లు, టాబ్లెట్లకు కూడా ఈ అప్‌డేట్ రిలీజ్ అవుతుంది.

యూజర్లు బీటా టెస్టింగ్ సమయంలో ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని, ఈ అప్‌డేట్‌లో అనేక మార్పులు చేశారు. 2025, మార్చి చివరి నాటికి, అర్హత కలిగిన అన్ని శామ్‌సంగ్ డివైజ్‌లకు ఈ అప్‌డేట్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. గెలాక్సీ S24 సిరీస్‌కు ఈ స్టేబుల్ అప్‌డేట్ ముందుగా వస్తుందని భావిస్తున్నారు.
* బీటా వెర్షన్, కొత్త ఫీచర్లు
ఇంతకుముందు, శామ్‌సంగ్ One UI 7 బీటా 3 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్‌లో, గెలాక్సీ S24 మోడల్స్‌లో ఫాస్ట్ ఫింగర్‌ప్రింట్ రికగ్నిషన్ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్లలో అత్యాధునిక అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి.
ఈ అప్‌డేట్‌లో ఐఫోన్ డైనమిక్ ఐలాండ్‌ను పోలిన "నౌ బార్" ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాదు, పూర్తిగా కొత్తగా డిజైన్ చేసిన కెమెరా యాప్, సోషల్ మీడియాలో వీడియోలు మరీ ఎక్కువ కాంతివంతంగా కనిపించకుండా HDR కంటెంట్‌ను డిసేబుల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నాయి.
శామ్‌సంగ్ ఈ వన్ UI 7 గురించి మాట్లాడుతూ, "ప్రతి టచ్‌పాయింట్‌లో AI ఏజెంట్లు, మల్టీమోడల్ సామర్థ్యాలను సాఫీగా అనుసంధానిస్తుంది" అని తెలిపింది. ఈవెంట్‌లో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
* గెలాక్సీ S25 ప్రీ-రిజర్వేషన్లు
గెలాక్సీ S25 సిరీస్ ఫోన్ల కోసం ప్రీ-రిజర్వేషన్లు భారతదేశంలో మొదలయ్యాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ లభిస్తాయి. గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్లు, 12GB RAMతో వస్తాయని భావిస్తున్నారు.
* శామ్‌సంగ్ ప్రాజెక్ట్ మూహన్
ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో శామ్‌సంగ్ "ప్రాజెక్ట్ మూహన్" ఒకటి. ఇది గూగుల్, క్వాల్‌కామ్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (XR) హెడ్‌సెట్. గూగుల్ ఆండ్రాయిడ్ XR ప్లాట్‌ఫామ్‌తో పనిచేసే ఈ హెడ్‌సెట్‌లో అత్యాధునిక డిస్‌ప్లేలు, పాస్-త్రూ సామర్థ్యాలు, మల్టీ-మోడల్ ఇన్‌పుట్లు ఉంటాయి. దీన్ని గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025లో రిలీజ్ చేయనున్నారు
మీడియా ప్రకారం, ఈ హెడ్‌సెట్ ద్వారా గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, జెమిని ద్వారా AI సహాయం వంటి సేవలను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








