శామ్‌సంగ్ రికార్డ్ లాభాలు!!

Posted By: Super

శామ్‌సంగ్ రికార్డ్ లాభాలు!!

 

దక్షిణ కొరియాకు చెందిన విశ్వవిఖ్యాత ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్‌లో రికార్డ్ ఫలితాలు సాధించింది. కంపెనీ ఈకాలంలో 470 కోట్ల డాలర్ల నిర్వహణ లాభాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చిప్స్, ఫ్లాట్ స్క్రీన్‌ల ఉత్పత్తిని పెంచేందుకు 22 బిలియన్ డాలర్ల వ్యయం చేయాలని నిర్ణయించింది.

రెడ్-హాట్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఆపిల్ గ్రూప్‌ని అధిగమించే దిశగా దూసుకెళుతున్న శామ్‌సంగ్ తమ గ్యాలక్సీ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల ఊతంతో భారీ లాభాలు ఆర్జించింది. ఈ కాలానికి తమ టెలికాం బిజినెస్ విభాగం రికార్డ్‌స్థాయిలో 2లక్షల 64 వేల వోన్‌ల లాభాన్ని నమోదు చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో సాధించిన 5లక్షల 30వేల వోన్‌ల (470 కోట్ల డాలర్లు) నిర్వహణ లాభం సంస్థ ముందస్తు అంచనాలకన్నా ఎక్కువగా వుంది. రెండో క్వార్టర్‌లోనూ కంపెనీ రికార్డుస్థాయిలో ఐదులక్షల వోన్‌ల ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot