శ్యామ్‌‍సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్

Posted By: Staff

శ్యామ్‌‍సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్

ప్రపంచంలో ఉన్న ఉన్న మొబైల్ తయారీదారులలో శ్యామ్‌సంగ్ ఒకటి. ప్రపంచం వ్యాప్తంగా మొత్తం 140 దేశాలలో తన కార్యకలాపాలను సాగిస్తుంది. అంతేకాకుండా ఆసియా బెస్ట్ మొబైల్ తయారీదారుగా ర్యాంకుని సాధించింది. శ్యామ్‌సంగ్ మొబైల్స్ ప్రస్తుతం బేసిక్ లెవల్ మొబైల్స్ పోన్స్ నుండి అత్యధిక ధరను కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్ వరకు విక్రయిస్తుంది. గత కొన్ని నెలలుగా చూసుకున్నట్లైతే శ్యామ్‌సంగ్ మొబైల్స్ మంచి అమ్మకాలను నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లైతే శ్యామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్స్ సిరిస్ వచ్చిన తర్వాత మరింతగా అమ్మకాలు ఊపందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే మొబైల్ పరిశ్రమలో వచ్చిన రూమర్స్‌ని చూస్తుంటే శ్యామ్‌సంగ్ కంపెనీ త్వరలో మరో గెలాక్సీ సిరిస్‌ స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం. ఆ మొబైల్ పేరు 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్'. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరిస్‌లో తర్వాత వస్తున్న మొబైల్ ఫోన్‌గా దీనిని పరిగణిస్తున్నారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్ ఫీచర్స్ గనుక చూసినట్లైతే 4.19 ఇంచ్ సూపర్ క్లియర్ ఎల్‌సిడి పుల్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంటుందని అంటున్నారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్ 1 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి, 2.3.4 వర్సన్ ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించబడింది.

'శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్' 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి, 720p ఫార్మెట్లో హై డెఫినేషన్ వీడియోని తీయడంలో సపోర్ట్ చేస్తుంది. 3జీ నెట్ వర్క్స్ ఫెసిలిటీ అయిన వీడియో కాలింగ్ ఫీచర్ కోసం శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్ మొబైల్ ముందు భాగంలో 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని రూపోందించడం జరిగింది. అన్ని రకాల మీడియా ఫైల్స్‌ని సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు మొబైల్‌లో ఎప్‌ఎమ్ రేడియో, హెడ్ ఫోన్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకుగాను 3.5 mm ఆడియో జాక్ కూడా మొబైల్ తో పాటు లభిస్తుంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పై, GPRS, EDGEలాంటి వాటన్నింటిని సపోర్ట్ చేస్తుంది. డేటాని ట్రాన్పర్ చేసుకోవడం కోసం యుఎస్ బి సింక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


Samsung Galaxy R specifications:

5 Mega Pixel Camera
1 GHz processor
Wi-Fi, 3G and Bluetooth
Android 2.3.4 Gingerbread OS
Up to 32 GB expandable Micro SD support
Java enabled
720p video recording
Music and video playback


శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్ కు సంబంధించిన ఖరీదుని ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌తో పోల్చితే గనుక దీని ధర ఖచ్చితంగా తక్కువగా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఆర్ ని 2011 చివరకల్లా మార్కెట్లోకి తీసుకోనిరావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot