సామ్‌సంగ్ నుంచి గేమింగ్ స్మార్ట్‌ఫోన్, 512జీబి స్టోరేజ్...
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఓ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఓ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్కెట్లో గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ల ఒరవడి కొత్తేమి కాదు. నోకియా, 2003లోనే N-Gaze పేరుతో ఓ గేమింగ్ సెంట్రిక్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిింది. ఆ తరువాత సోనీ ఎరిక్సన్ నుంచి ఎక్స్‌పీరియా ప్లే పేరుతో మరో ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. తాజాగా రాజర్ కంపెనీ Razer phone పేరుతో ఓ శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. రాజార్ కంపెనీ బాటలోనే షావోమి, ఆసుస్ వంటి బ్రాండ్‌లు కూడా ఇదే తరహా సూట్‌ను ఫాలో అవుతున్నాయి. గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో సామ్‌సంగ్ కూడా ఈ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తోంది.

గేమింగ్ స్మార్ట్‌ఫోన్ పై సామ్‌సంగ్ కసరత్తు...
సామ్‌సంగ్ ఓ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తోన్న విషయాన్ని @MMDDJ అనే టిప్‌స్టర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేసారు. ఈయన ట్వీట్ చేసిన వివరాల ప్రకారం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ పై సామ్‌సంగ్ వర్క్ చేస్తోంది. ఈ ఫోన్ స్పెక్స్‌ను మాత్రం సదురు టిప్‌స్టర్ రివీల్ చేయలేదు.
హై రిఫ్రెష్ రేటుతో కూడిన డిస్‌ప్లే...
అయితే ఇతర గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే ఈ ఫోన్ కూడా హై రిఫ్రెష్ రేటుతో కూడిన డిస్‌ప్లేతో వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ టిప్‌స్టర్ నుంచి గతంలో లీక్ అయిన పలు రూమార్స్ ప్రకారం ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో బ్లుటూత్ ఫంక్షనాలిటీతో స్పందించగలిగే ఎస్‌పెన్ సపోర్ట్ ఉండబోతోంది.
ఆగష్టు 9న గెలాక్సీ నోట్ 9..
ఇదిలా ఉండగా సామ్‌సంగ్ తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ 9కు సంబంధించి లాంచ్ ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను ఆగష్టు 9న న్యూయార్క్ లో నిర్వహించే ఓ అన్‌ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ స్పెక్స్ కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు.
గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)..
తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం గెలాక్సీ నోట్ 9 డివైస్‌లో ఎక్సినోస్ 9810 లేదా స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌లను నిక్షిప్తం చేసే అవకాశముంది. ఇదే సమయంలో 6జీబి ర్యామ్, 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి హార్డ్‌వేర్ స్పెక్స్‌ను ఈ ఫోన్ క్యారీ చేసే వీలుంది. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి డ్యుయల్ రేర్ కెమెరా మాడ్యుల్‌తో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసే అవకాశముంది.


Click it and Unblock the Notifications








