ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ రెక్స్ 70, 90

Posted By:

సామ్‌సంగ్ అభిమానులకు గుడ్ న్యూస్. మన్నికైన ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణుల్లో సామ్‌సంగ్ ఆవిష్కరించిన ‘రెక్స్'(Rex) సిరీస్ స్మార్ట్‌ఫొన్‌లు ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సామ్‌సంగ్ తన సరికొత్త రెక్స్ సిరీస్ నుంచి రెక్స్ 60, రెక్స్ 70, రెక్స్ 80, రెక్స్ 90 మోడళ్లలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లను దేశీయ విపణిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వీటిలో రెక్స్ 70, రెక్స్ 90 మోడళ్లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ ( Flipkart) ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తోంది.

సామ్‌సంగ్ రెక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు సంబంధించి ఫోటోలు కోసం క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ రెక్స్ 70:

డ్యూయల్ సిమ్, 3 అంగుళాల కెపాసిటవ్ OVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 10 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, బ్లూటూత్, యూఎస్బీ 2.0, 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 13 గంటలు). ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్‌బుక్, ట్విట్టర్, చాటాన్, జీటాక్ ఇంకా ప్రత్యేక గేమ్స్. ధర రూ.4,385. లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ రెక్స్ 70, 90

సామ్‌సంగ్ రెక్స్ 90:

3.2అంగుళాల కెపాసిటివ్ HVGA డిస్‌ప్లే, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, బ్లూటూత్, యూఎస్బీ 2.0, వై-ఫై, 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 15 గంటలు). ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్‌బుక్, ట్విట్టర్, చాటాన్, జీటాక్ ఇంకా ప్రత్యేక గేమ్స్. ధర రూ.5,870. లింక్ అ్రడ్రస్: 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot