Home
Mobile

సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ ఇదే!

సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.

By Gizbot Bureau

సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ డివైస్‌కు సంబంధించిన యూజర్ మాన్యువల్‌ను తన అఫీషియల్ రష్యన్ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ యూజర్ మాన్యువల్‌లో ఫోన్ మోడల్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు పొందుపరచబడి ఉన్నాయి.

SM-J260F మోడల్ నెంబర్‌తో లభ్యం..

SM-J260F మోడల్ నెంబర్‌తో లభ్యం..

సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోన్న ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ SM-J260F అనే మోడల్ నెంబర్‌తో అందుబాటులో ఉంటుంది. రిమూవబుల్ బ్యాటరీ‌ ప్యాక్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్స్ గో, మ్యాప్స్ గో, గూగుల్ గో వంటి ఆండ్రాయిడ్ గో యాప్స్ ప్రీ-ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. అయితే స్టాక్ ఇంటర్‌ఫేస్ కాకుండా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ సామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ యూఎక్స్ ప్లాట్‌ఫామ్ పై ఈ ఫోన్ రన్ అవుతుందట.

 

 

రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌, డ్యుయల్ సిమ్ స్లాట్..

రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌, డ్యుయల్ సిమ్ స్లాట్..

ఈ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌ను గెలాక్సీ జే2 కోర్ పేరుతో సామ్‌సంగ్ విడుదల చేసే అవకాశముందని పలు రిపోర్ట్స్ అంచనా వేస్తున్నాయి. సామ్‌మొబైల్ అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ అయిన వివరాల ప్రకారం సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు రెండు సిమ్ కార్డ్‌స్లాట్స్, మైక్రోయూఎస్బీ పోర్ట్ అలానే మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్స్ అందుబాటులో ఉంటాయి.

 

 

Smart Switch పేరుతో ప్రత్యేకమైన యాప్‌..

Smart Switch పేరుతో ప్రత్యేకమైన యాప్‌..

రష్యన్ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయిన వివరాల ప్రకారం సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ గో హ్యాండ్‌సెట్‌లో Smart Switch పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను సామ్‌సంగ్ నిక్షిప్తం చేయబోతోంది. ఈ ప్రీలోడెడ్ యాప్ ద్వారా రెండు డివైస్‌ల మధ్య డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. ఆన్-స్ర్కీన్ గెస్ట్యర్ కంట్రోల్స్‌తో పాటు మూడు సాంప్రాదయ ఆన్-స్ర్కీన్ నేవిగేషన్ బటన్స్‌ను ఈ ఫోన్‌లో సామ్‌సంగ్ ఏర్పాటు చేస్తోంది.

 

 

గీక్‌బెంచ్ లిస్టింగ్స్ ప్రకారం...

గీక్‌బెంచ్ లిస్టింగ్స్ ప్రకారం...

గీక్‌బెంచ్ లిస్టింగ్స్ ప్రకారం సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి.. 5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 7570 సాక్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాతో పాటు నేపాల్, బాంగ్లాదేశ్ అలానే శ్రీలంకల్లో సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రాంతాన్ని బట్టి SM-J260F, SM-J260G, SM-J260M మోడల్ నెంబర్స్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Samsung's First Android Go Smartphone Now Revealed Through Official User Manual.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X