సామ్‌సంగ్ మడత ఫోన్ వచ్చేస్తోంది..

|

సామ్‌సంగ్ భవిష్యత్ ఆవిష్కరణల్లో ఒకటైన గెలాక్సీ ఎక్స్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోబోతోంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గురించి గత కొంత కాలంగా అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా తెలియవచ్చిన సమచారం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫైనల్ ప్రొటోటైప్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే ఈ ప్రోటోటైప్ ప్రపంచానికి పరిచయం కాబోతోంది. Bloomberg రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి ఓ స్పెషల్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను సామ్‌సంగ్ అభివృద్థి చేయిస్తోందట. ఇందుకుగాను గూగుల్‌తో కలిసి సామ్‌సంగ్ పనిచేస్తోంది.

వన్‌ప్లస్ 6టీ ఇండియా లాంచ్ గురించి పూర్తి వివరాలు

బెండింగ్ మెకనిజం కారణంగా..
 

బెండింగ్ మెకనిజం కారణంగా..

విన్నర్ అనే కోడ్ నేమ్‌తో డిజైన్ కాబడుతోన్న ఈ ఫోల్డబుల్ ఫోన్‌ కోసం గూగుల్ ఎటువంటి ఓఎస్‌ను అభివృద్థి చేస్తోంది అనేదాని పై ఇంకా స్పష్టత లేదు. బ్లూమ్‌బర్గ్ రివీల్ చేసిన మరికొన్ని వివరాల ప్రకారం సామ్‌సంగ్ విన్నర్, 4 అంగుళాల స్ర్కీ‌న్‌తో రాబోతోంది. 200 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ప్రోటోటైప్ డివైస్‌లో బెండింగ్ మెకనిజం కారణంగా ఇన్-స్ర్కీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఉండదట. గెలాక్సీ ఎస్10తో పాటు ఈ ప్రోటోటైప్ డివైస్‌ను 2019లో ప్రదర్శించే అవకాశముందని తెలుస్తోంది.

హువావే నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్..

హువావే నుంచి ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్..

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై పరిశోధనలు ముమ్మరమవుతోన్న నేపథ్యంలో చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హువావే , ఓ ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్ పై వర్క్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2018 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హువావే సీఈఓ రిచర్డ్ యు, ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు.

ల్యాప్‌టాప్‌లతో పోటీపడే సత్తా..

ల్యాప్‌టాప్‌లతో పోటీపడే సత్తా..

తాము అభివృద్థి చేస్తోన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చినట్లయితే ల్యాప్‌టాప్‌లు పూర్తిగా కనుమరుగు అయిపోతాయని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు చిన్న చిన్న స్ర్కీన్‌లను కలిగి ఉండటం కారణంగా ల్యాప్‌టాప్‌ల హవా ఇంకా కొనసాగుతోందని, బెండబుల్ ఫోన్‌ల రాకతో ఆ పరిస్థితి మారిపోబోతోందని ఆయన తెలిపారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ స్ర్కీన్‌ను ప్రొవైడ్ చేసే వీలుండటంతో ఇవి ల్యాప్‌టాప్‌లతో సమానంగా పనచేయగలుగుతాయట.

సామ్‌సంగ్, హువావేల మధ్య పోటీ..
 

సామ్‌సంగ్, హువావేల మధ్య పోటీ..

ల్యాప్‌టాప్‌లతో పోటీపడగలిగే బెండబల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలోపు కమర్షియల్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు యు తెలిపారు. ఇదే సమయంలో సామ్‌సంగ్ కూడా తన మొదటి కన్స్యూమర్ గ్రేడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్, హువావే ఫోల్డబుల్ టైప్ ఫోన్‌ల మధ్య భీకర పోరు నెలకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమంటోన్న సామ్‌సంగ్..

ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమంటోన్న సామ్‌సంగ్..

ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌ల పై సామ్‌సంగ్ మొబైల్ చీఫ్ డీజీ కోహ్ స్పందిస్తూ, తాము ఫ్లెక్సిబుక్స్ స్ర్కీన్స్ అలానే దాని సంబంధిత టెక్నాలజీలను వినియోగించుకుని సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నామని, అయితే ఇవి ల్యాప్‌టాప్‌లకు ప్రత్యామ్నాయంగా నిలబడతాయని తాము అనుకోవటం లేదని అన్నారు. ఫోల్డబుల్ టైప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండస్ట్రీ పై ఏ విధమైన ప్రభావాన్ని చూపుబోతున్నాయి అనే దానే పై ఇంకా స్పష్టమైన అంచనాకు తాము రాలేదని ఆయన తెలిపారు.

సామ్‌సంగ్, హువావే బాటలో షియోమి  కూడా...

సామ్‌సంగ్, హువావే బాటలో షియోమి కూడా...

హువావే బాటలోనే షియోమి కూడా ఓ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు రూమర్స్ మిల్స్ కోడై కూస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి షియోమి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ న్యూస్ అందుబాటులో లేదు. ఇదే సమయంలో ఒప్పో కూడా ఓ బెండబుల్ ఫోన్ అభివృద్థి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung's foldable phone will run special Android version: Details here.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X