ప్రతీ 6 నెలలకూ ఫోన్ మార్చుకునే అవకాశం: సామ్‌సంగ్

Posted By:

తమ నుంచి విడుదలైన ఖరీదైన స్మార్ట్ ఫోన్ లను క్రెడిట్ కార్డ్ యూజర్లు 18 నెలల సులభ వాయిదా స్కీమ్ లలో కొనుగోలు చేయటమే కాకుండా... 6 నెలలు తరువాత ఆ ఫోన్‌ను మార్చుకొని సరికొత్త మోడల్ ను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సామ్ సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘Stay New' (ఎల్లప్పుడూ ఉండండి లేటెస్ట్‌గా) పేరుతో సరికొత్త యాజమాన్య కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ప్రతీ 6 నెలలకూ ఫోన్ మార్చుకునే అవకాశం: సామ్‌సంగ్

ఈ పథకంలో భాగంగా యువత ప్రతి 6 నెలలకు తాము వినియోగిస్తున్న ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు 18 నెలల సులభ వాయిదాల్లో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3, నోట్ 2, నోట్ 10.1, గెలాక్సీ ఎస్ శ్రేణిలోని ఎస్4, ఎస్4 మినీ, ఎస్3, గెలాక్సీ టాబ్లెట్ 3 (7.8) మోడళ్లను కొనుగోలు చేయవచ్చు.

జనవరి 1 నుంచి మార్చి 31లోపు ఈ మోడళ్ల కొనుగోలు పై సామ్‌సంగ్ కొంత మొత్తం నగదును క్యాష్ బ్యాక్ రూపంలో చెల్లిస్తుంది. 6 నెలల తరువాత ఈ మోడళ్లను మార్చుకుని, అప్పుడు విపణిలోకి వచ్చే కొత్త మోడల్ గెలాక్సీ ఫోన్లను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకుగాను సామ్‌సంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్‌గ్రామ్ మైక్రో సంస్థ సహకరిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తమ పాత గెలాక్సీ ఫోన్‌ను ఇచ్చేసి కొత్త గెలాక్సీ స్మార్ట్‌పోన్‌ను ఎంపిక చేసుకోవాలనుకునే వినియోగదారులు ఇన్‌గ్రామ్ టోల్‌ఫ్రీ నెంబరుకు కాల్‌చేస్తే సంబంధిత సిబ్బంది మీరుమార్చబోయే ఫోన్‌ను పరిశీలించి, ఎంత మొత్తం చెల్లిస్తారో చెబుతారు. అందుకు అంగీకరిస్తే నగదును నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అప్పుడు మళ్లీ మీరు కొత్త గెలాక్సీ  మోడల్‌ను కొనుగోలు చేసే అవకాశముంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot