ఏకంగా 31 శాతం డిస్కౌంట్.. 200MP కెమెరా, 12GB RAM, 120Hz డిస్‌ప్లే కలిగిన Samsung S24 Ultra 5G..
Samsung Galaxy S24 Ultra price drop : మీరు ఓ మంచి టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఇదే మీకు సరైన సమయం. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ AI పర్ఫామెన్స్‌తో దుమ్మురేపుతున్న శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
సాధారణంగా రూ.1,34,999 ధర ఉండే ఈ ప్రీమియం ఫోన్, ఇప్పుడు ఏకంగా 31% తగ్గింపుతో కేవలం రూ.92,890 ధరకే అందుబాటులో ఉంది. ఆఫర్ ఇక్కడితో అయిపోలేదు. బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMIలు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.

* భారీ ధర తగ్గింపు, అదనపు డిస్కౌంట్లు..
అసలు డిస్కౌంట్ కాకుండా, అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేస్తే, అదనంగా రూ.2,786 తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు, ఇదే కార్డ్‌తో 6-నెలల పాటు వడ్డీ లేని సులభ వాయిదాలలో (No-Cost EMI) ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ ఖరీదైన ఫోన్‌ను కొనడం మరింత సులభం అవుతుంది.
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే, దాని బ్రాండ్, మోడల్, కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.71,300 వరకు కూడా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం హై-ఎండ్ ఫోన్ల మార్కెట్లో ఇది నిజంగా ఓ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వినియోగం చేసుకుంటే ఈ ప్రీమియం మొబైల్‌ను రూ.50 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.
* కళ్లు చెదిరే డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్
S24 అల్ట్రాలో 6.8-అంగుళాల క్వాడ్ HD+ డైనమిక్ అమోలెడ్ 2X ఫ్లాట్ డిస్‌ప్లే ఉంది. దీని 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ పై విజువల్స్ చాలా స్మూత్‌గా, చూడటానికి అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్‌కు ఎంతో మన్నికైన టైటానియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ ఇచ్చారు.
అంటే, ఇది స్టైలిష్‌గా ఉండటమే కాదు, చాలా ధృడంగా కూడా ఉంటుంది. ఇక శాంసంగ్ సిగ్నేచర్ స్టైల్ అయిన S పెన్ కూడా దీనితో వస్తుంది. నోట్స్ రాయడానికి, బొమ్మలు గీయడానికి, ఫోన్‌ను సులభంగా ఆపరేట్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
* పవర్‌ఫుల్ AI పర్ఫామెన్స్, అదిరిపోయే గేమింగ్ అనుభూతి
ఈ ఫోన్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత వేగవంతమైన ప్రాసెసర్లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ వాడారు. దీనికి తోడు 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనివల్ల మల్టీ టాస్కింగ్ చాలా వేగంగా చేసుకోవచ్చు, ఎలాంటి లాగ్స్ ఉండవు.
గేమింగ్ ప్రియుల కోసం రియల్-టైమ్ రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల గేమ్స్‌లోని గ్రాఫిక్స్, నీడలు మరింత వాస్తవికంగా కనిపిస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 14 బేస్డ్ One UI 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది, అన్ని ప్రధాన 5G నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది.
* ప్రొఫెషనల్ కెమెరా సిస్టమ్‌తో ఫోటోగ్రఫీలో కింగ్..
ఫోటోలు తీయడం ఇష్టపడేవారికి S24 అల్ట్రా ఓ వరం లాంటిది. ఇందులో ఏకంగా 200MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 12MP కెమెరా ఇచ్చారు.
శాంసంగ్ 'ప్రోవిజువల్ ఇంజన్' టెక్నాలజీ AI సహాయంతో ఫోటోల క్లారిటీని పెంచుతుంది, నాయిస్‌ను తగ్గిస్తుంది, రంగులను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. 'సర్కిల్ టు సెర్చ్' వంటి స్మార్ట్ ఫీచర్లు మీ కెమెరా అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఫోన్ ఆఫ్ అవుతుందనే టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications








