‘శామ్‌సంగ్ S5222’ అత్యుత్తమ డ్యూయల్ సిమ్ ఫోన్!!

Posted By: Prashanth

‘శామ్‌సంగ్ S5222’ అత్యుత్తమ డ్యూయల్ సిమ్ ఫోన్!!

 

ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణను అందుకుంటున్న ‘శామ్‌సంగ్’ సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత డ్యూయల్ సిమ్ మొబైల్‌ను ప్రవేశపెట్టనుంది. ‘శామ్‌సంగ్ ఎస్5222’ మోడల్‌లో వస్తున్న ఈ స్మార్ట్ డివైజ్ సౌకర్యవంతమైన మొబైలింగ్‌కు ఉపకరిస్తుంది. రెండు నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే ఈ డ్యూయల్ సిమ్‌ఫోన్ నిక్కార్సైన పనితనాన్ని కలిగి ఉంటుంది.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* 3 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్, * అన్‌ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * 1జీబి ఇంటర్నల్ మెమెరీ, * 512 ఎంబీ ర్యామ్, * 16జీబి ఎక్స్‌టర్నల్ మెమెరీ, * మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, * 3జీ కనెక్టువిటీ, * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్ * ఆండ్రాయిడ్ v2.1 ఆపరేటింగ్ సిస్టం, *  1 GHz కార్టెక్స్ ఏ-8 ప్రాసెసర్,  * బ్యాటరీ స్టాండ్‌బై టైమ్ 350 గంటలు.

త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యంకానున్న ‘శామ్‌సంగ్ S5222’ ధర ఇండియన్ మార్కెట్లో రూ.8,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot