యాపిల్ వైభవాన్ని చూసి తట్టుకొలేక పోతున్న శాంసంగ్

Posted By: Super

యాపిల్ వైభవాన్ని చూసి తట్టుకొలేక పోతున్న శాంసంగ్

శాంసంగ్, యాపిల్ మద్య గత కొంత కాలంగా ఉత్పత్తుల పరంగా యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే ఆ యుద్దం ఇప్పుడు యాపిల్ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ ఫోన్ మీద దెబ్బ చూపనుంది. వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్ అందించిన సమాచారం ప్రకారం శాంసంగ్ మొబైల్ కంపెనీ టోక్యో జిల్లాలోని జిల్లా కోర్టు, న్యూసౌత్ వేల్స్ రిజస్ట్రీ(ఆస్టేలియా)లో కేసులు నమోదు చేసింది. వైర్ లెస్ టెలికమ్ స్టాండర్డ్ హాక్కుల ప్రకారం ఐఫోన్ 4ఎస్ అమ్మకాలను జపాన్, ఆస్ట్రేలియాలో నిలిపివేయాల్సిందిగా కొరింది.

ఇది మాత్రమే కాకుండా ఐఫోన్ 4, ఐఫోన్ 2 మీద కూడా శాంసంగ్ జపాన్‌లో నిషేదించమని కొరడం జరిగింది. గతంలో యాపిల్ కంపెనీ చేసిన శాంసంగ్‌పై చేసిన ఆరోపణల కారణంగా శాంసంగ్ గెలాక్సీ టాబ్ 10.1ని ఆస్ట్రేలియా, యూరప్‌లో నిషేధించడం మనం చూశాం. దీంతో శాంసంగ్ ఆస్ట్రేలియాలో ఐఫోన్ 4ఎస్ విడుదల సందర్బంగా కావాలనే వివాదాలను సృష్టిస్తుందంటూ యాపిల్ ఆరోపిస్తుంది. యాపిల్‌కి పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ II వారం పాటు కేవలం $2 విక్రయించనున్నట్లు బోర్డులను ఏర్పాటు చేసింది.

దీంతో ఎవరైతే శాంసంగ్ అభిమానులు శాంసంగ్ గెలాక్సీ ఎస్ IIని సొంతం చేసుకునేందుకు జనాభా బారులుగా నిలబడి ఉండడం జరిగింది. ఐతే శాంసంగ్ మొబైల్ కంపెనీ మాత్రం శాంసంగ్ గెలాక్సీ ఎస్ II మొబైల్‌ని $2లకు విక్రయించడానికి గాను ఓ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏమిటంటే లైన్‌లో ఎవరైతే మొదటి పది మంది ఉంటారో వారికి మాత్రమే శాంసంగ్ గెలాక్సీ ఎస్ IIని $2లకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దాంతో ఒక్కసారి అభిమానులు షాక్‌కి గురి అయ్యారు.

శాంసంగ్ ఇలా చేయడానికి కారణం ఆస్టేలియా దేశంలో ఉన్న సిడ్నీ మహానగరంలో శాంసంగ్, యాపిల్ రెండు స్టోర్స్ కూడా ఒకే వీధిలో ఉండండతో శాంసంగ్ ఈ $2 స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. $2 అనడంతో శాంసంగ్ అభిమానులు శాంసంగ్ స్టోర్ నుండి యాపిల్ స్టోర్ ముందు వరకు బారులుగా నిలబడి ఉన్నారు. ఈ ప్రక్కనున్న చిత్రంలో ఆ విషయాన్ని క్లుప్తంగా గమనించవచ్చు. ఈ విధంగా నైనా శాంసంగ్ స్టోర్ ముందు ఎక్కవ మంది జనాభాని ఆకర్షిద్దామనే ప్రయత్నంలో భాగంగా ఇలా చేసిందని కొందరు నిపుణులు భావించారు.

కానీ యాపిల్ ఐఫోన్ 4ఎస్ మాత్రం విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్మకాలు జరుపుకున్నాయి. వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చినప్పుడు మొత్తం 40 లక్షల యూనిట్లకు ఆర్డర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాల్లో శుక్రవారం స్టోర్స్‌లలో ఐఫోన్‌ 4ఎస్‌ అందుబాటులోకి వచ్చింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot