స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సామ్‌సంగ్ సరికొత్త రికార్డ్

|

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2013, నాలుగవ త్రైమాసికంలో సామ్‌సంగ్ 86 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించి యాపిల్ పై భారీ ఆధిపత్యాన్ని సాధించింది. అయినప్పటికి ఈ త్రైమాసికంలో యాపిల్ తన అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకోగలిగింది. ప్రముఖ అంతర్జాతీర రీసెర్చ్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

 
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సామ్‌సంగ్ సరికొత్త రికార్డ్

సామ్‌సంగ్ గతేడాది అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్‌లో 29.6 శాతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. యాపిల్ 17.6 శాతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాను కొల్లగొట్టింది. తరువాతి స్థానాల్లో హవాయి 5.7 శాతం, లెనోవో 4.7 శాతం మార్కెట్ వాటాలను పొందాయి.

2013, అక్టోబర్ - డిసెంబర్‌తో ముగిసి నాలుగవ త్రైమాసికంలో సామ్‌సంగ్ మొత్తం 89 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో నిలిచిన యాపిల్ 51 మిలియన్ల ఐఫోన్‌లను విక్రయిచింది.

మూడవ స్థానంలో నిలిచిన హవాయి టెక్నాలజీస్ లిమిటెడ్ 16.6మిలియన్ యూనిట్లు, నాలుగవ స్థానంలో నిలిచిన లెనోవో గ్రూప్ లిమిటెడ్ 13.6 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ యూనిట్‌లను విక్రయించగిలిగాయి.

2013లో మొత్తం 319.8మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్‌లను విక్రయించిన సామ్‌సంగ్ 32.2 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో ఉంది. ఆ తరువాతి స్థానంలో నిలిచిన యాపిల్ 153.5 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్‌లను విక్రచయించి 15.5 మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X