శ్యామ్‌సంగ్ సూపర్ ఆండ్రాయిడ్ ఫోన్..

Posted By: Staff

శ్యామ్‌సంగ్ సూపర్ ఆండ్రాయిడ్ ఫోన్..

శ్యామ్‌సంగ్ మార్కెట్లోకి మరో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరు శ్యామ్‌సంగ్ ఎస్‌హెచ్‌వి ఈ120ఎల్. యూజర్స్ కొసం ప్రత్యేకంగా 4.7 ఇంచ్ మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్ స్కీన్‌తో రూపొందించబడింది. స్క్రీన్ 1280 x 720 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. హై ఎండ్ మొబైల్స్ విభాగంలో విడుదలవుతున్న ఈ మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1.5 GHz డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలవుతున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్‌ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుండడంతో శ్యామ్‌సంగ్ ఎస్‌హెచ్‌వి ఈ120ఎల్ స్మార్ట్ ఫోన్‌ని కూడా ఆండ్రాయిడ్ వి2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే విధంగా రూపొందించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా శ్యామ్‌సంగ్ ఎస్‌హెచ్‌వి ఈ120ఎల్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఐస్ క్రీన్ శాండ్ విచ్ ఆండ్రాయిడ్ వర్సన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

మొమొరీ విషయానికి వస్తే మొబైల్‌తో పాటు 1జిబి RAM లభిస్తుండగా, ఇంటర్నల్ మొమొరీ 16జిబి లభిస్తుంది. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. శ్యామ్‌సంగ్ ఎస్‌హెచ్‌వి ఈ120ఎల్ స్మార్ట్ ఫోన్‌ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో 1080p హై డెఫినేషన్ వీడియోని రికార్డింగ్ చేయవచ్చు. మొబైల్ ముందు భాగంలోఉన్న2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ టెక్నాలజీ, geo tagging, night mode, face detection మొదలగునవి అదనపు ప్రత్యేకతలు.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే A2DP బ్లూటూత్‌ని సపోర్ట్ చేయగా, జిపిఎస్ ద్వారా కమ్యూనికేషన్‌ని కనెక్ట్ చేసుకొవచ్చు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మార్కెట్లోకి దీనికి సంబంధించిన ధరను ప్రవేశపెట్టలేదు.త్వరలోనే వన్ ఇండియా పాఠకుల కోసం ఈ మొబైల్‌కి సంబంధించిన సమాచారం అందివ్వడం జరుగుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting