తాజాగా విడుదలైన శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్లు!!

మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్లను శామ్‌సంగ్ ఇండియా మంగళవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో ఈ ఫోన్లను డవలెప్ చేసినట్లు శామ్‌సంగ్ ఇండియా, మొబైల్ అండ్ ఐటీ విభాగాధిపతి రంజిత్ యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఇండియన్ మార్కెట్లో శామ్‌సంగ్ తన పరిధిని మరింత విస్తరించినట్లైంది. ముఖ్యంగా గెలక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు భారతీయులకు మరింత సుపరిచితం కానున్నాయి. ఈ లైనప్ నుంచి మూడు మోడల్స్ లో విడుదలైన స్మార్ట్ ఫోన్ల వివరాలు క్లుప్తంగా...
శామ్‌సంగ్ గెలక్సీ ఏస్ డ్యూయోస్ (మోడల్ నెం: SCH-i589)
* డ్యూయల్ సిమ్,
* సీడీఎమ్ఏ, జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్ ,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* ఫోన్ డిస్‌ప్లే 8.80 సెంటీమీటర్లు,
* బ్యాటరీ టాక్ టైమ్ 7 గంటలు,
* ధర రూ.17,000.
శామ్‌సంగ్ గెలక్సీ వై ప్రో డ్యూయోస్ (మోడల్ నెం:GT B5512)
* డ్యూయల్ సిమ్ సపోర్ట్,
* క్వర్టీ కీబోర్డ్,
* సౌకర్యవంతమైన నావిగేషన్,
* స్ర్కీన్ సైజ్ 6.5 సెంటీమీటర్లు,
* టచ్‌స్ర్కీన్ టైప్,
* ధర రూ.11,000.
శామ్‌సంగ్ గెలక్సీ వై డ్యూయోస్ (మోడల్ నెం: GT-S6012):
* 3.14 అంగుళాల స్ర్కీన్,
* 832 MHz ప్రాసెసర్,
* ప్రీలోడెడ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్,
* ధర రూ.10,000.


Click it and Unblock the Notifications