కాఫీ కొట్టారంటూ శ్యామ్‌సంగ్ పై ఆపిల్ ఫిర్యాదు..!!

Posted By: Super

కాఫీ కొట్టారంటూ శ్యామ్‌సంగ్ పై ఆపిల్ ఫిర్యాదు..!!

‘‘దిగ్గజ గ్యాడ్జెట్ శ్రేణులైన శ్యామ్‌సంగ్, ఆపిల్ మధ్య భీకర పోరు రాజుకుంది. గెలక్సీ స్మార్ట్ ఫోన్ రూపకల్పనలో భాగంగా ‘శ్యామ్‌సంగ్’ తమ డిజైన్లను కాఫీ కొట్టిదంటూ ‘ఆపిల్’ హక్కుల ఉల్లంఘన కింద కేసు దాఖలు చేసింది. ప్రస్తుత మొబైల్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారిన ఈ హాట్ టాపిక్ వీటి అమ్మకాల పై ఏ మేరకు ప్రభావం చూపనుందో వేచి చూడాలి.’’

అయితే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఈ బ్రాండ్లను గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేందుకు సన్నద్ధం చేస్తున్నాయి. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన ఇరు బ్రాండ్లు అత్యాధునిక పరికరాలను ప్రవేశపెట్టి తమ సత్తాను చాటుకోనున్నాయి. శ్యామ్‌సంగ్ ‘స్ట్రాటోస్పియర్’ పేరుతో స్మార్ట్ ఫోన్ పరికరాన్ని విడుదల చేస్తుండగా, దిగ్గజ ఆపిల్ ‘ఐఫోన్ 5’ను ప్రవేశపెట్టబోతుంది.

‘శ్యామ్‌సంగ్ స్ట్రాటోస్పియర్’ ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిస్తే:

- ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ‘శ్యామ్‌సంగ్ స్ట్రాటోస్పియర్’ స్టైలిష్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనుంది.
- క్వర్టీ స్లైడర్ కీప్యాడ్ సౌలభ్యంతో పాటు టచ్‌స్క్రీన్, ఇతర డిస్‌ప్లే అంశాలు వినియోగదారులను ప్రత్యేకంగా ఆకట్టకుంటాయి.
- పొందుపరిచిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా నాణ్యమైన చిత్రాలను పదిలపరచుకునేందుకు ఉపకరిస్తుంది.
- ఫోన్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా వీడియో ఛాటింగ్‌కు అనువుగా ఉంటుంది.

‘ఐఫోన్ 5’ ఫీచర్లు క్లుప్తంగా :

- శక్తివంతమైన 1.4 GHz ఆపిల్ A5 డ్యూయల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థ ‘ఐఫోన్’ పనితీరును సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
- ఆధునిక 4 OLED స్క్రీన్ 960 X 640 పిక్సల్ రిసల్యూషన్ ప్రత్యేక ఆకర్షణ.
- వై-ఫై, యూఎమ్‌డి‌ఎస్, హెచ్ఎస్‌డిపీఏ, 3జీ, 4జీ, హెచ్ఎస్పీఏ వంటి వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.
- 8 మెగా పిక్సల్ డ్యూయల్ లెడ్ ఫ్లాష్‌లైట్ కెమెరా నాణ్యమైన ఫోటోలను చిత్రీకరిస్తుంది.
- భారతీయ మార్కెట్లో ‘ఐఫోన్ 5’ ధర రూ.40000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot