గెలాక్సీ ఎస్8 సూపర్ హిట్టే, సిద్ధంగా 100 లక్షల ఫొన్‌లు

తన అప్‌కమ్మింగ్ గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేసుకుంటోంది. ఓ ప్రముఖ వెబ్ మీడియా కథనం ప్రకారం ఫోన్ లాంచ్ నాటికి 100 లక్షలకు పైగా యూనిట్లను సిద్ధంగా ఉంచాలని సామ్‌సంగ్ భావిస్తున్నట్లు సమాచారం.

Read More : 6జీబి ర్యామ్‌‌తో Coolpad ఫోన్, ఇండియా రిలీజ్ ఎప్పుడంటే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్చి 29న గెలాక్సీ అన్‌ప్యాకుడ్ ఈవెంట్‌లో...

మార్చిలో 4.7 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 7.8 మిలియన్ గెలాక్సీ ఎస్8 యూనిట్లను ఉత్పత్తి చేసేందుకు ప్రొడక్షన్ షెడ్యూల్‌ను సామ్‌సంగ్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్8 ప్లస్ ప్రొడక్షన్ విషయంలోనూ సామ్‌సంగ్ ఇదే షెడ్యూల్ ఫాలో అవుతుందా లేదా అన్న విషయం వెల్లడికావల్సి ఉంది. మార్చి 29న న్యూయార్క్‌లో నిర్వహించనున్న గెలాక్సీ అన్ ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా గెలాక్సీ ఎస్8ను లాంచ్ చేయనున్నారు.

4కే క్వాలిటీ స్ర్కీన్..

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8 1440 x 2560పిక్సల్ రిజల్యూషన్‌తో కూడిన 4కే స్క్రీన్‌తో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తోంది.

6 జీబీ ర్యామ్‌ కెపాసిటీతో..

ర్యామ్ విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఉంటుందని సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే 4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. ఎంత రఫ్ గా వాడినా 24 గంటలు బ్యాటరీ లైఫ్ ఉండే విధంగా దీన్ని రూపొందించారు.

30 మెగాపిక్సెల్ కెమెరా..

కెమెరా అయితే దుమ్మురేపనుంది. మునుపెన్నడూ తీసుకురానంత స్థాయిలో 30 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో పాటు డ్యూయెల్ లెన్స్ కెమెరాతో ఈ ఫోన్ రానుంది.

ధర విషయానికి వచ్చేసరికి..

ఇక ధర విషయానికి వస్తే గెలాక్సీ ఎస్8 కూడా ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ రేంజ్‌లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు వేరియంట్లలో వస్తున్న గెలాక్సీ ఎస్ 8 64 జీబీ రూ .55,000, 128 జీబీ రూ. 60,000 ఉండొచ్చని అంచనా.

ఆడియో జాక్‌ను తొలగించినట్టు తెలుస్తోంది

అయితే ఎస్8లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అలాగే వైర్‌లెస్ ఎయిర్ బడ్స్‌ను కూడా లాంచ్ చేయనుంది. సామ్సంగ్ తన అప్‌కమింగ్ గెలాక్సీ ఎస్8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung targeting 10 million Galaxy S8 units at the time of launch: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot