మెగా బ్రాండ్.. యమా స్ట్రాంగ్ (సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లలో 3జీబి ర్యామ్..?)!

Posted By: Staff

 మెగా బ్రాండ్.. యమా స్ట్రాంగ్ (సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లలో 3జీబి ర్యామ్..?)!
 

సామ్‌సంగ్ అభిమానులకు ఈ వార్త మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ‘గెలాక్సీ ఎస్3’కి సక్సెసర్‌గా 2013లో విడుదల కాబోతున్స సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ పటిష్టమైన 3జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే అవకాశముందని ‘సామ్ మొబైల్’ తాజా నివేదిక ద్వారా బహిర్గతమైంది. ఈ నివేదికను మరింత బలపరస్తూ విడుదలైన ఓ ఫోటోగ్రాఫ్ మార్కెట్ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తోంది. 3జీబి ర్యామ్ సపోర్ట్ చేసేవిధంగా తమ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను పటిష్టపరిచే పనిలో సామ్‌సంగ్ వర్గాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అయితే, రానున్న కాలంలో ‘బటన్ లెస్ ట్రెండ్’ను ప్రవేశపెట్టే యోచనను కూడా సామ్‌సంగ్ వర్గాలు పరిశీలిస్తున్నట్లు వినికిడి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ధరలు తగ్గుముఖం వివిధ ఆన్‌లైన్ స్టోర్‌లలో ధరలు:

సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3ను కొనుగోలు చేద్దామనుకునే వారికి ఇదే సరైన సమయం. మార్బుల్ వైట్, పెబ్బిల్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తాజాగా సామ్‌సంగ్ ఈ-స్టోర్ రూ.42,500 నుంచి రూ.35,499కు తగ్గించింది. ఇతర రిటైలర్‌ల వద్ద గెలాక్సీ ఎస్3 ధరలను పరిశీలిద్దాం…

Adexmart.com: గెలాక్సీ ఎస్3 (పెబ్బిల్ బ్లూ) కలర్ వేరియంట్ ధర రూ.33,990.

సాహోలిక్ డాట్ కామ్ (saholic.com): గెలాక్సీ ఎస్3 (పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్, రెడ్) ధర రూ.34,900. కూపన్‌ను ఉపయోగిస్తే ధరలో రూ.500 రాయితీ. కూపన్ కోడ్ SJunglee.

షాప్ క్లూస్ డాట్ కామ్(Shopclues.com): గెలాక్సీ ఎస్3 (మార్బుల్ వైట్) ధర రూ.33,999.

Yebhi.com: గెలాక్సీ ఎస్3 (పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్) ధర రూ.34,900, ఈఎమ్ఐ సౌలభ్యత.

జూమ్ఇన్ (Zoomin): గెలాక్సీ ఎస్3 (మార్బుల్ వైట్) ధర రూ.34,990, కొనుగోలు సమయంలో SAMGALS3కోడ్ నెంబర్‌తో కూడిన కూపన్‌ను  ఉపయోగించినట్లయితే స్పెషల్ గిఫ్ట్.

బుయ్ ద ప్రైస్ డాట్ కామ్(Buytheprice.com): గెలాక్సీ ఎస్3 (మార్బుల్ వైట్) ధర రూ.34,900.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot