ర్యాంక్ నెం.1... ఈ జూన్‌లో!!

Posted By: Staff

ర్యాంక్ నెం.1... ఈ జూన్‌లో!!

 

నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  శామ్‌సంగ్ గత ఏడాది ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ SCH-R940 టికాల్ ఎట్టకేలకు ఈ జూన్‌లో విడుదల కానుంది. అనుకున్నదాని ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావల్సి ఉంది. పలు అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని మార్పు చేశారు. 4జీ ఎల్‌టీ‌‌ఈ వ్యవస్థను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధర విలువ రూ.10,000.

మూడున్నర అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్, గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1 జిగాహెడ్జ్ సింగిల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8665 ప్రాసెసర్,  క్వాల్కమ్ అడిర్నో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,  ఎక్స్‌టర్నల్ మెమరీ 32జీబి, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్,  నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, మల్టీ  ఫార్మాట్ వీడియో ప్లేయర్,  గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో.

ఈ ఫోన్‌లోని ప్రధాన విశేషాలను పరిశీలిస్తే నిక్షిప్తం చేసిన 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ  వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది.  అదనపు ఫీచర్లైన బ్లూటూత్ స్టీరియో ఆడియో ప్రొఫైల్,

బుల్ట్ - ఇన్- డిజిటల్ కంపాస్, 4జీ హాట్‌స్పాట్, శామ్‌సంగ్ టచ్‌విజ్ 4యూఐ వంటి అంశాలు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot