సామ్‌సంగ్ ఫోన్‌ల నుంచి 157 టన్నుల బంగారం!

రీకాల్ చేయబడిన గెలాక్సీ నోట్ 7 ఫోన్‌‌లకు సంబంధించి వేస్టేజ్‌ను తగ్గించుకునే క్రమంలో వాటి నుంచి గోల్డ్ ఇంకా ఇతర ఖరీదైన మెటల్స్‌తో పాటు విలువైన కాంపోనెంట్లను రికవర్ చేసే పనిలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

157 టన్నుల వరకు..

రిటర్న్ చేయబడిన కోట్లాది గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ల నుంచి దాదాపుగా 157 టన్నుల వరకు గోల్డ్, సిల్వర్, కోబాల్ట్, కాపర్ తదితర మెటల్స్‌ను సేకరించే అవకాశముందని సామ్‌సంగ్ తెలిపింది.

ఫోన్‌ల నుంచి వేరుచేసే విడిభాగాలను..

నోట్ 7 ఫోన్‌ల నుంచి వేరుచేసే డిస్‌ప్లే మాడ్యుల్స్, మెమరీ చిప్స్, కెమెరా మాడ్యుల్స్ అలానే ఇతర కాంపోనెంట్లను అమ్మటం లేదా రీసైకిల్ చేయటం జరుగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

4 లక్షల Galaxy Note FE ఫోన్‌లను తయారు చేసి...

రీకాల్ చేయబడిన నోట్ 7 ఫోన్‌లకు సంబంధించి ఉపయోగించని విడిభాగాలతో 4 లక్షల యూనిట్ల Galaxy Note FE ఫోన్‌లను తయారు చేసి వాటిని దక్షిణ కొరియాలో విక్రయించేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తోంది. వీటిని విక్రయించటం ద్వారా నష్టాలను ఎంతో కొంత పూడ్చుకోవచ్చన్నది సామ్‌సంగ్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

బ్యాటరీ ఫెయిల్యుర్ కారణంగా

సామ్‌సంగ్ నుంచి గతేడాది భారీ అంచనాల మధ్య మార్కెట్లో విడుదలైన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ ఫెయిల్యుర్ కారణంగా కంపెనీకి భారీ నష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే.

వేల కోట్లలో నష్టాలు..

గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యుర్ కారణంగా దాదాపుగా 5 బిలియన్ డాలర్లను సామ్‌సంగ్ నష్టపోయినట్లుగా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung to extract 157 tons of gold, silver and other metals from Galaxy Note 7. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot