మెగా ప్లాన్.. వేడిలో వేడి?

Posted By: Staff

 మెగా ప్లాన్.. వేడిలో వేడి?

టెక్ ప్రపంచంలో ఉత్కంఠ రేపుతున్న స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలక్సీ3, మే3న లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే. 2012 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల గెలక్సీ ఎస్3 ఒకటిగా నిలుస్తుందన్న ధీమాను పలువురు వ్యక్తంచేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  గెలక్సీ ఎస్3 ఆవిష్కరణ కార్యక్రమంలో ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని శామ్‌సంగ్ పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్  ఆధారితంగా ఈ టాబ్లెట్ రన్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాబ్లెట్ విడుదలకు సంబంధించి  వ్యక్తమవుతున్న పుకార్లలో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.

గెలక్సీ ఎస్3 ఫీచర్లు:

- 4.6 అంగుళాల డిస్‌ప్లే,

-   1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

-   ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

-   1జీబి ర్యామ్,

-   8 మెగా పిక్సల్ కెమెరా,

-   16 మెమరీ, (మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా మరింత పొడిగించుకునే అవకాశం),

- 2050 mAh బ్యాటరీ,

-   ఎన్ఎఫ్‌సీ సపోర్ట్,

ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫ్రంట్ కెమెరాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గెలక్సీ ఎస్3 ఆవిష్కరణకు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting