డెడ్‌లైన్ దగ్గర పడింది?

By Prashanth
|
Samsung


మెగాబ్రాండ్ సామ్‌సంగ్, ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2012’లో ప్రకటించిన అత్యంత పల్చటి స్వభావం కలిగిన ‘యోమ్ డిస్‌ప్లే’(Youm display)లు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ అల్ట్రాథిన్ ఆమోల్డ్ ప్యానల్‌ను కాగితం తరహలో మడతపెట్చుకోవటంతో పాటు బెండ్ చేసుకోవచ్చు. ‘యోమ్ డిస్‌ప్లే’ మందం 0.6మిల్లీమీటర్లు. ప్రసత్తు ఆమోల్డ్ డిస్ ప్లేలతో పోలిస్తే 3 రెట్టు పలచన. 2014 నాటికి ఈ ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీ నాన్-ఫోల్డబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. ఫోల్డబుల్ స్వభావం కలిగిన యోమ్ డిస్‌ప్లే టెక్నాలజీ ఆవిర్భావంతో నాన్-ఫోల్డబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న యోమ్ డిస్‌ప్లేలు డివైజ్ మందాన్ని తగ్గించటంతో పాటు స్లిమ్ లుక్‌ను తెచ్చిపెడతాయి.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే:

పల్చని పొరతో కూడిన LCDలను రూపొందించటంలో ఎల్‌జీడి (ఎల్‌జీ డిస్‌ప్లే) సంస్థ క్రియాశీలక పాత్రపోషిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ తొలి ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే (ఇపీడీ)లను ఇ-బుక్స్ కోసం తయారు చేసింది. ఈ – ఇంక్ ఆధారిత ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే పరిమాణం 6 అంగుళాలు. రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్. ఈ సరికొత్త ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ఈ-బుక్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తేనుందని విశ్లేషకుల అంచనా. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలను రానున్న ఈ-బుక్ రీడర్లలో ఉపయోగించనున్నారు. ఈ డిస్‌ప్లే ఆధారిత గ్యాడ్జెట్‌లు వచ్చే నెల నుంచి యూరప్‌లో లభ్యం కానున్నాయి. ఈ సరికొత్త డిస్‌ప్లే పేపర్‌లో చదివిన అనుభూతిని మీకు కలిగిస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే‌ను 40డిగ్రీల వరకు వంచవచ్చు. అంతేకాదండోయ్. ఈ డిస్‌ప్లే కిందపడినా పెద్ద ప్రమాదమేమి ఉండదు. కంటి రుగ్మతలను తగ్గిస్తుంది. తక్కువ విద్యుత్‌ను ఖర్చుచేస్తుంది. ధర కూడా తక్కువే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X