వారసుడి రంగప్రవేశానికి లైన్ క్లియర్..?

Posted By: Staff

వారసుడి రంగప్రవేశానికి లైన్ క్లియర్..?

‘కమ్ ఎండ్ మీట్ ద నెక్స్ట్ గెలక్సీ’ నినాదంతో భవిష్యత్‌ను శాసించేందుకు శామ్‌సంగ్ సమాయుత్తమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వాడివేడి ఉత్కంఠ రేపుతున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలక్సీ ఎస్ III’ఆవిష్కరణకు మార్గం సుగమమైనట్లు ప్రచారం జోరందుకుంది. మే3న లండన్‌లో నిర్శహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బృహత్తర ఆవిష్కరణ చోటుచేసుకోనుందని టెక్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ లాంచ్‌కు సంబంధించి శామ్‌సంగ్ ఇప్పటికే "come and meet the next Galaxy" ట్యాగ్‌లైన్‌తో ఆహ్వాన పత్రాలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ ఫీచర్లకు సంబంధించి ఏ విధమైన సమాచారం లేదు.

గెలక్సీ ఎస్ III కీలక ఫీచర్లు (అంచనా):

- క్వాడ్ కోర్ ప్రాసెసర్,

- 4.7’’హై డెఫినిషన్ డిస్‌ప్లే,

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఆ మధురక్షణాలు మీ సమీప స్టోర్‌లలో ..

ఆ మధుర క్షణాల కోసం ఉత్కంఠతో వేచి ఉన్న భారతీయులకు తమ తమ కలలను సాకారం చేసుకునే సమయం రానే వచ్చింది. టెక్ ప్రేమికులను ఊరించి.. మైమరిపించిన స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలక్సీ ప్లస్ ఎట్టకేలకు ఇండియాలో విడుదలైంది. ధర రూ.16,290. ఈ స్మార్ట్‌ఫోన్ కోనుగోలు పై రూ.1299 విలువ చేసే బ్లూటూత్ స్టీరియో హ్యాండ్‌సెట్ పూర్తిగా ఉచితం. గెలక్సీ సిరీస్ నుంచి 2011లో విడుదలై అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్ ‘శామ్‌సంగ్ గెలక్సీ ఏస్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఏస్ ప్లస్’ విడుదలైంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting