షియోమికి అసలైన సవాల్, నాలుగు స్మార్ట్‌ఫోన్లతో శాంసంగ్ వార్ !

|

ఇండియాలో దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం ఆపిల్ నువ్వా నేనా అని తలపడుతున్న సంగతి తెలిసిందే. మిడ్ ఫోన్ సెగ్మెంట్ రేంజ్ లో ఈ రెండు కంపెనీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. అయితే ఇప్పుడు శాంసంగ్ ఏకంగా నాలుగు ఫోన్లతో షియోమి మీద యుద్ధానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇన్ఫినిటీ డిస్ ప్లేతో శాంసంగ్ జె సీరిస్ లో ఒకే సారి నాలుగు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్ ఒకే సారి జె సీరిస్ లో నాలుగు ఫోన్లను లాంచ్ చేయబోతుందనే విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు బయటపెట్టాయి.

 

సైలెంట్‌గా దూసుకొస్తున్న Redmi S2, సర్‌ప్రైజ్ అంటున్న షియోమిసైలెంట్‌గా దూసుకొస్తున్న Redmi S2, సర్‌ప్రైజ్ అంటున్న షియోమి

ఈ నెల 21న మార్కెట్లో...

ఈ నెల 21న మార్కెట్లో...

శాంసంగ్ మిడ్‌ సెగ్మెంట్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను ఈ నెల 21న మార్కెట్లో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఈ ఫోన్లు గెలాక్సీ నోట్ 9, గెలాక్సీ ఎస్‌ 9లాంటి స్మార్ట్ ఫోన్లలో ఉన్న ఫీచర్లతో రాబోతున్నాయని సమాచారం.

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో..

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో..

ప్రధానంగా ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో పాటు బెజిల్ లెస్ డిస్ ప్లేలతో ఈ ఫోన్లు రానున్నాయి. అయితే వీటన్నింటినని కంపెనీ నోయిడా లోని కేంద్రంలో రూపొందించడం మరో విశేషం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వీటిని బయటకు తెచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులే లక్ష్యంగా..
 

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులే లక్ష్యంగా..

బెజెల్‌ లెస్‌ స్ర్కీన్‌, సరసమైన ధరతో లక్షలాది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందకు ప్రణాళికలు రచించింది. ఎస్‌ బైక్‌ మోడ్‌, అల్ట్రా డేటా సేవింగ్‌ ( యూడీఎస్‌) చార్జింగ్‌లో టర్బో స్పీడ్‌ లాంటి కీలక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రడీ అయిపోయింది.

Turbo Speed

Turbo Speed" technology

S bike" mode, Ultra Data Saving (UDS) mode and "Turbo Speed" technologyలు ప్రధాన ఆకర్షణగా ఈ ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే జె సీరిస్ లో తొలిసారిగా శాంసంగ్ Galaxy J7 Duoని ఈ ఏడాది రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. డ్యూయెల్ కెమెరాతో వచ్చిన దీని ధర మార్కెట్లో రూ. 16,990గా ఉంది.

హోమ్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌..

హోమ్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌..

గెలాక్సీ జె7 డ్యుయోలో 5.5 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. వీటితో తీసుకునే ఫొటోలను బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ చేసుకోవచ్చు. ఇక ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. డిస్‌ప్లే కింద ఉన్న హోమ్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, డ్యుయల్ సిమ్‌ల కోసం 3 స్లాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జె7 డ్యుయో ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ జె7 డ్యుయో ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్‌ అధికారిక ప్రకటన..

శాంసంగ్‌ అధికారిక ప్రకటన..

ఇప్పుడు జే సిరీస్‌లో వస్తున్న ఈ నాలుగు డివైస్‌లు స్పష్టమైన ఫీచర్లు, ఇతర స్పెషిఫికేషన్లు, ధరలు తదితర అంశాలపై క్లారిటీ రావాలంటే శాంసంగ్‌ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

 

Best Mobiles in India

English summary
Samsung to revamp Galaxy 'J' with 4 smartphones in India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X