లేడీస్ స్పెషల్!

Posted By: Prashanth

లేడీస్ స్పెషల్!

 

ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ నిర్మాణ సంస్థ సామ్‌సంగ్ మహిళల కోసం ప్రత్యేకించి గెలాక్సీ ఎస్2 క్రిస్టల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్‌చే 2011లో విడుదలైన గెలాక్సీ ఎస్2 ఆ ఏడాది ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌గా ప్రశంసలు అందుకుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న ప్రొఫెషనల్ మహిళలను లక్ష్యంగా చేసుకుని లిమిటెడ్ స్థాయిలో క్రిస్లల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు సామ్‌సంగ్ పేర్కొంది. శ్యామ్ మొబైల్ బహిర్గతం చేసిన నివేదికలు ఆధారంగా ఈ క్రిస్టిల్ ఎడిషన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 వైట్ లెదర్‌తో కూడిన బ్యాక్ కవర్ క్లాడ్‌ను కలిగి ఉంటుంది.

Read In English

క్రిస్టల్ ఎడిషన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 ఫీచర్లు:

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్),

1.2గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

ఇంటర్నల్ మెమెరీ 16,32జీబి వేరియంట్స్,

మైక్రోఎస్డీ కార్ల్ స్లాట్ ద్వారా మెమరీ 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ధర ఇతర వివరాలు:

క్రిస్టల్ ఎడిషన్ గెలాక్సీ ఎస్2ను ఐఎఫ్ఏ-2012 కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశముంది. అక్టోబర్ నాటికి మార్కెట్లో లభ్యమవుతుంది. ధర రూ.42,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot