హైఎండ్ అమ్మకాల్లో దుమ్మురేపిన శాంసంగ్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ విభాగ అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఖరీదైన స్మార్ట్‌ఫోన్ విభాగ అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం సెగ్మెంట్ ఆగస్టు విక్రయాల్లో ఈ సంస్థ విలువ పరంగా 60 శాతం మార్కెట్ వాటాను, సంఖ్య పరంగా 62.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ జీఎఫ్‌కే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మార్కెట్ వాటా ఆగస్టులో ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం 'శాంసంగ్ నోట్ 9' విడుదలేనని అధ్యయనంలో తేలింది.

నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం..
ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన శాంసంగ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆదిత్య నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రూ.6,000 క్యాష్ బ్యాక్ వంటి పలు ఆఫర్లతో
ఆగస్టు 24న నోట్ 9 విడుదల జరిగినప్పటికీ, అదే నెల 10 నుంచే రూ.6,000 క్యాష్ బ్యాక్ వంటి పలు ఆఫర్లతో ముందస్తు బుకింగ్స్ ప్రారంభించడం వల్ల ఇది సాధ్యపడిందని తెలిపారు.

రూ.40,000 మించిన స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో..
రూ.40,000 మించిన స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 55.5 శాతం, రూ.30,000 మించిన స్మార్ట్‌ఫోన్ విభాగంలో 55 శాతం మార్కెట్ వాటాను ఆగస్టులో శాంసంగ్ సంస్థ కైవసం చేసుకుంది.

స్మార్ట్‌ఫోన్ ఏ9
ఇక అక్టోబర్ 11న రూ.30,000 స్థాయి మించిన స్మార్ట్‌ఫోన్ ఏ9 విడుదల కానుంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు
6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్, బారో మీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్



Click it and Unblock the Notifications








