Home
Mobile

శ్యామ్‌సంగ్ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ శ్యామ్‌సంగ్ ట్రాన్స్‌ఫామ్

By Super
Samsung Transform
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోవాలనే తపనతో టాప్ మొబైల్ తయారీదారులైన నోకియా, శ్యామ్‌సంగ్, సోనీ ఎరిక్సన్, మోటరోలా, ఎల్‌జీల మద్య పోటీ ప్రారంభమైంది. ఈ పోటీలో మార్కెట్లోకి రోజుకో మోడల్‌తో ప్రత్యక్షం అవుతున్నాయి. పైన పేర్కోన్న కంపెనీలలో మంచి నాణ్యమైన మొబైల్స్‌ని అందిస్తున్న కంపెనీలలో శ్యామ్‌సంగ్ ఒకటి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో శ్యామ్‌సంగ్ కంపెనీ విడుదలచేసినటువంటి అన్ని మొబైల్స్ కూడా మార్కెట్లో మంచి సక్సెస్‌ని సాధించాయి.

ప్రస్తుతం యూజర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ పైనే వారి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ అన్ని రకాలుగా ఉపయోగపడడమే ఇందుకు కారణం. అందులో భాగంగా శ్యామ్‌సంగ్ త్వరలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగినటువంటి తక్కువ ధర మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దానిపేరు శ్యామ్‌సంగ్ ట్రాన్స్‌ఫామ్. శ్యామ్‌సంగ్ ట్రాన్స్‌ఫామ్ అనేది టచ్ స్క్రీన్‌తో పాటు క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉంటుంది. మెను బటన్స్‌ని ఈజీగా చూసేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌గా ఉంటుంది.

శ్యామ్‌సంగ్ ట్రాన్స్‌ఫామ్ ఆండ్రాయిడ్ ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో, 800 MHz ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 3.2 మెగా ఫిక్సల్‌ని కలిగి ఉండి, వీడియో రికార్డింగ్ పీచర్ దీని ప్రత్యేకత. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల మల్టీమీడియా ఫార్మెట్ల(MP3, MP4, AAC+, AVI, 3GP, WMV)ను సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా బేసిక్ ఫోన్స్‌లలో ఉండేటటువంటి ఎఫ్‌ఎమ్ రేడియో కూడా ఇందులో అమర్చడం జరిగింది. మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది.

శ్యామ్‌సంగ్ ట్రాన్స్‌ఫామ్ ఇంటర్నల్‌గా 512 MB మొమొరీని కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా యూజర్స్ బయట మొమొరీని 32 GB విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. మీ వీడియో క్లిప్స్, సాంగ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఈ మొమొరీ సరిపోతుందనుకుంటాను. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, GPRS, EDGE లాంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది.

The notable Samsung Transform features are:

Android Froyo OS
800 MHz processor
Java support
3G
Wi-Fi and Bluetooth
3.2 Mega Pixel Camera
Good battery backup
Up to 32 GB of external memory

శ్యామ్‌సంగ్ ట్రాన్స్‌ఫామ్‌ని ఇండియన్ మిడ్ రేంజి మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోని విడుదల చేయడం జరుగుతుంది. ఇక దీని ఖరీదు రూ 8000.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X