శాంసంగ్ నుంచి ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ "గెలాక్సీ G ఫోల్డ్" .. ఎప్పుడు విడుదల కానుంది..?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో క్రమంగా కొత్త మోడళ్లు, కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే భారత్ మార్కెట్‌లోకి ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే భవిష్యత్‌లో ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు ఈ ఫోన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే హువావే తన ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ హువావే మేట్ XT అల్టిమేట్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్న శాంసంగ్.. ట్రై ఫోల్డ్ ఫోన్ 'గెలాక్సీ G ఫోల్డ్' పైనా (Samsung Galaxy G Fold) దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

లాంచ్ ఎప్పుడు? :
సౌత్ కొరియాకు చెందిన పబ్లికేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ETNews ఆధారంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ట్రై ఫోల్డ్ ఫోన్ విడిభాగాలను శాంసంగ్ సేకరించే అవకాశం ఉందని తెలిపింది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 హ్యాండ్‌సెట్‌లతోపాటు గెలాక్సీ G ఫోల్డ్ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అంటే జులైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
G స్టైల్ ఫోల్డబుల్ డిజైన్ :
ఇప్పటికే హువావే తన ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫోన్ కంటే శాంసంగ్ భిన్నమైన డిజైన్‌లో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. హువావే ప్రస్తుతం S డిజైన్‌తో ట్రై ఫోల్డ్ ఫోన్‌ను రూపొందించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ G స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
కమర్షియల్ వెర్షన్ :
ఫలితంగా ఫోల్డింగ్ సమయంలో గెలాక్సీ G ఫోల్డ్ హ్యాండ్‌సెట్ 9.96 అంగుళాల ఇన్నర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఫలితంగా కవర్ డిస్‌ప్లే కోసం ప్రత్యేకమైన స్క్రీన్ అవసరం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే డిస్‌ప్లేకు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడవ్వగా.. అయితే కమర్షియల్ వెర్షన్ లాంచ్ కావాల్సి ఉంది.
పోటీనిచ్చేనా :
శాంసంగ్ తన ట్రై ఫోల్డ్ మోడల్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉన్న హువావేకు పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ గతంలో సౌత్ కొరియా మరియు చైనాలో గెలాక్సీ Z ఫోల్డ్ SE మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
2 లక్షల యూనిట్లు మాత్రమే :
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ తొలిదశలో కొన్ని రీజియన్‌లలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు తొలుత కేవలం 2 లక్షల యూనిట్లు మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్లోబల్ లాంచ్ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్ ప్రాధాన్య మార్కెట్‌గా ఉంది. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు భారత్ లో భారీ డిమాండ్ ఉంటోంది. అయితే ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్‌లకు ఎలాంటి ప్రాధాన్యత ఉండనుందో తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








