మూడు డిస్‌ప్లేలతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్.. కీలక వివరాలు లీక్.. పేరు ఏంటో తెలుసా..?
ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ ( Samsung ) నుంచి ఇటీవల గెలాక్సీ S25 సిరీస్‌ను విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ లు లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం శాంసంగ్ ప్రస్తుతం ట్రై ఫోల్డ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో అధునాతన డిస్‌ప్లేలపై పరిశోధనలు చేస్తున్న శాంసంగ్ తాజాగా ట్రై ఫోల్డ్ డిస్‌ప్లే హ్యాండ్‌సెట్ లపై పనిచేస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు. ఈ ఫోన్ పేరు, ఇతర వివరాలను వెల్లడించారు.
ఇప్పటి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన చైనా సంస్థ :
గత సంవత్సరం హువావే ఇటీవల ట్రై ఫోల్డ్ ఫోన్ ను ఆవిష్కరించింది. హువావే మేట్ XT స్మార్ట్‌ఫోన్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. మూడు డిస్‌ప్లేలతో 10.2 అంగుళాల ట్యాబ్లెట్ తరహాలో కనిపిస్తుంది. ప్రస్తుతం డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్‌ల హవా కొనసాగుతున్న సమయంలో ట్రై ఫోల్డ్ ఫోన్ లు భారీ డిమాండ్‌ను సొంతం చేసుకొనే అవకాశం ఉంది.

ఏ పేరుతో లాంచ్ కానుంది ? :
అయితే తాజాగా శాంసంగ్ ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్ గురించి కీలక వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ yeux1122 ఈ స్మార్ట్‌ఫోన్ పేరు వివరాలను లీక్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ G Fold గా (Samsung Galaxy G Fold) లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్ బరువు 298 గ్రాములుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 9.96 అంగుళాల వెడల్పు, 6.54 అంగుళాల ఎత్తును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని, మెరుగైన అనుభూతి కలుగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ కవర్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.
ధర వివరాలు :
శాంసంగ్ G ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ అంచనా ధర వివరాలు లీక్ అయ్యాయి. ఈ ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్ 256GB స్టోరేజీ వేరియంట్ ధర $1899.99 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.1,65,566) గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మిగిలిన వేరియంట్‌ల వివరాలు, ధరలు వెల్లడి కావాల్సి ఉంది.
అయితే ఈ ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్ ఎప్పుడు విడుదల కానుంది, ఎలాంటి ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండనున్నాయో పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ట్రై ఫోల్డ్ ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. అయితే ఎలాంటి కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉందనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతం అన్ని ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటున్నాయి.
మెరుగై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ కూడా మెరుగైన AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే సంస్థ మాత్రం ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే భారత్ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ధరతో విడుదల కానుందో వెల్లడి కాలేదు.
రేపటి నుంచి గెలాక్సీ S25 సిరీస్ సేల్ :
ఇటీవల భారత్‌లో అందుబాటులోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో డిస్కౌంట్‌లను పొందవచ్చు. ముందస్తు బుకింగ్‌లు చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను అందించనుంది.


Click it and Unblock the Notifications








