సరిక్రొత్త శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్..

By Super
|
Samsung Galaxy Z
ప్రతి ఒక్కరికి తమ పాకెట్స్‌లలో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్IIని తీసుకొని వెళ్శాలని ఉంటుంది. కానీ అటువంటి కొరిక ఉన్నప్పటికీ దానిని వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అందుకు కారణం శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్II బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండడమే. అలాంటి వారి మొరను ఆలకించిన దేవుడు సరిగ్గా అలాంటి మొబైలే అదే కంపెనీ నుండి విడుదల చేసేలా చేశారు. దాని పేరే 'శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్'.

ఎవరికైతే శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్ కావలనుకుంటున్నారో అలాంటి వారు దానిని స్వీడన్ నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇండియాలో ఇంకా ఈ మొబైల్ విడుదల కాలేదు కాబట్టి. శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్ 4.2 ఇంచ్ కలిగి ఉండి ఎల్‌సిడి స్క్రీన్‌తో తయారు చేయబడింది. ఇక ఈ మొబైల్ 1 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్‌లో మీ డబ్బుకు తగ్గ కెమెరా ఉంటుంది. 5మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ప్లాష్ కూడా దీని ప్రత్యేకం.

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్‌లలో శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్ ఒకటి. ఈ మొబైల్‌కి ముందు భాగాన ఉన్నటువంటి 1.3మెగా ఫిక్సల్ కెమెరా వల్ల స్మార్ట్ టెక్నాలజీ అయినటువంటి ముఖాన్ని గుర్తించే సదుపాయం ఇందులో ఉంది. మీకు నచ్చినటువంటి అన్ని రకాలైన సాంగ్స్, వీడియోస్‌ని అప్ లోడ్ చేసుకునేందుకు గాను 8జిబి మొమొరీ కార్డు మొబైల్‌లో పోందుపరచడం జరిగింది. ఇక ఈ మొబైల్ చుట్టుకొలతలు శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్II మాదిరే ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ మొబైల్ యూరప్ మార్కెట్ గాల్లో తేలియాడుతుంది. త్వరలోనే ఇండియన్ మొబైల్ మార్కెట్లో దర్శనమివ్వనుంది. ఇండియన్ మార్కెట్ ప్రస్తుతం బాగా అభివృద్ది చెందుతున్న మొబైల్ మార్కెట్. రోజురోజుకి ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఎన్నో కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ పోన్స్ విడుదల అవుతూనే ఉన్నాయి.

Samsung Galaxy Z Features:

Slim design like its older Samsung SII
Good battery back up.
Bluetooth and WIFI connectivity
A vibrant 4.2 inch touch screen
Gingerbread OS
8GB internal memory and micro SD expandable memory
5 Mega pixel rear cam with LED flash and a 1.3 MP front cam

ఇండియన్ మార్కెట్లో శ్యామ్‌‌సంగ్ గెలాక్సీ జడ్ బాగా క్లిక్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి గల కారణం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్‌కి మంచి గిరాకీ ఉండడమే. ఇక శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్‌కు కాంపిటేషన్‌గా నిలచేటటువంటి ఇతర కంపెనీలు ఐపోన్, నోకియా ఎన్9 మాత్రమే. ఆపిల్ కంపెనీ ఇటీవలే ఐపోన్ 3జిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా రంగంలోకి దిగనున్న శ్యామ్‌సంగ్ గెలాక్సీ జడ్ రాకకోసం మొబైల్ కస్టమర్స్ వేయి కళ్శతో వేచిచూస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X