సామ్‌సంగ్ విండోస్8 స్మార్ట్‌ఫోన్!

Posted By: Prashanth

సామ్‌సంగ్ విండోస్8 స్మార్ట్‌ఫోన్!

 

ప్రపంచపు తొలి విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ బెర్లిన్‌లో జరుగుతున్న ఐఎఫ్ఏ-2012 ప్రదర్శనలో భాగంగా బుధవారం ఆవిష్కరించింది. పేరు ఏటీఐవీఎస్ (ATIV S). సామ్‌సంగ్ తాజా ఆవిష్కరణ నోకియా ఇంకా హెచ్‌టీసీ బ్రాండ్‌లకు సవాల్‌గా నిలవనుంది. నోకియా తన తొలి విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌ను సప్టంబర్ 5న ఆవిష్కరిస్తున్న నేపధ్యంలో.. అంతకన్నా ముందే సామ్‌సంగ్ విండోస్ 8 ఫోన్‌ను ఆవిష్కరించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్-నవంబర్ మధ్యలో మార్కెట్లోకి ఈ మొబైల్ రానుంది. మరోవైపు, గెలాక్సీ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ వెర్షన్‌ను కూడా ఈ సందర్భంగా శాంసంగ్ ఆవిష్కరించింది.

ఫీచర్లు:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 32జీబి, రేడియో ఆధారిత శాటిలైట్ నావిగేషన్ సిస్టం, బ్లూటూత్ వర్షన్ 3.0, యూఎస్బీ వర్షన్ 2.0, వై-ఫై కనెక్టువిటీ, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, జియో మ్యాగ్నటిక్, గైరోస్కోప్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot