సామ్‌సంగ్ నుంచి మరో సంచలనం!

సామ్‌సంగ్, ఓ వినూత్న స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. W2017 పేరుతో సామ్‌సంగ్ డిజైన్ చేసిన ఈ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ క్లామ్‌షెల్ ఫోన్ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. యునిబాడీ మెటల్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ ఫ్లిప్ మోడల్ ఫోన్ రెండు (ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్) డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

Read More : బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

4.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ (1920 x 1080పిక్సల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

4జీబి ర్యామ్‌..

వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌తో పాటు 4జీబి ర్యామ్‌ను ఈ డివైస్‌లో పొందురిచారు.

వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్

వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఈ బ్యాటరీ సింగ్ ఛార్జ్ పై 64 గంటల స్టాండ్ బై టైమ్‌ను ఇవ్వగలదట.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

64జీబి జీబి ఇంటర్నెల్ స్టోరేజ్

ఈ స్మార్ట్‌ఫోన్ 64జీబి జీబి ఇంటర్నెల్ స్టోరేజ్ సదుపాయంతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 256జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్..

4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సదుపాయంతో ప్రత్యేకమైన 12 మెగా పిక్సల్ కెమెరాను ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ స్కానర్..

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ ఆకట్టుకుంటుంది. Always On Display ఫీచర్ ఫోన్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ

ఈ డ్యుయల్ సిమ్ ఫ్లిప్ ఫోన్‌లో 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, సామ్‌సంగ్ పే వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.

ధర ఎంతో తెలుసా..?

127.8 x 61.4 x 15.8 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో 208 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ఫోన్ ధర చైనా కరెన్సీ ప్రకారం రూ.1,97,298గా ఉండొచ్చని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung W2017 flip phone launched with Snapdragon 820 SoC, 4GB RAM. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot