చరిత్ర సృష్టించడానికి వస్తున్న వేవ్ 3

Posted By: Staff

చరిత్ర సృష్టించడానికి వస్తున్న వేవ్ 3

మార్కెట్లోకి విడుదలైన శ్యామ్‌సంగ్ వేవ్ 2 స్లైడర్ మోడల్ మాత్రమే కాదు క్యాండీ బార్ హ్యాండ్ సెట్ కూడా. 3.7 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండడం వల్ల యూజర్స్ యొక్క చూపులు మరల్చుకోకుండా తనవైపు లాక్కునే సమ్మోహాన శక్తి కలిగినది శ్యామ్‌సంగ్ వేవ్ 2 మొబైల్. శ్యామ్‌సంగ్ వేవ్ 2 వేవ్ 2 మొబైల్ బడా ఆపరేటింగ్ సిస్టమ్ 2 వర్సన్‌‍తో రన్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే శ్యామ్‌సంగ్ కంపెనీ శ్యామ్‌సంగ్ వేవ్ 2 కంటే కొత్తదైన అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్ బడా 2.1 వర్సన్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది.

శ్యామ్‌సంగ్ వేవ్ 2 కేవలం 3.7 ఇంచ్ డిస్ ప్లే, 2.3 మెగా ఫిక్సల్‌ కెమెరాని కలిగి ఉండి చక్కని ఇమేజిలను తీసుకునేందుకు వీలుగా రూపోందించడం జరిగింది. అదే శ్యామ్‌సంగ్ వేవ్ 3 మాత్రం 4 ఇంచ్ డిస్ ప్లే మల్టీ టచ్ స్క్రీన్‌తో పాటు స్క్రాచ్ ప్రూప్ గ్లాస్ షీల్డ్ దీని సొంతం. మొబైల్ తో పాటు ప్రాక్సిమిటీ సెన్సార్స్‌తో పాటు 5 మెగా పిక్సల్ కెమెరా దీని సొంతం. అంతేకాకుండా 720p ఫార్మెట్లో హై డెఫినేషన్ వీడియోలను కూడా తీస్తుంది. శ్యామ్‌సంగ్ వేవ్ 2, శ్యామ్‌సంగ్ వేవ్ 3 మొబైల్స్ రెండు కూడా డాల్ఫిన్ 2.0 వెబ్ బ్రౌజర్స్‌తో రూపోందించబడ్డాయి.

శ్యామ్‌సంగ్ వేవ్ 2లో మ్యూజిక్‌ని ఆస్వాదించేందుకు గాను చక్కని మ్యూజిక్ ప్లేయర్స్‌తో పాటు బయట స్పీకర్స్‌ని కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5 mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. శ్యామ్‌సంగ్ వేవ్ 3 వీడియో ప్లేయర్ హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లు mp4 and Xvid, DivX, wmv, h.263, h264లను కూడా సపోర్ట్ చేస్తుంది. రెండు మోడల్స్ కూడా వై-పై కంపాటబులిటీ పీచర్స్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక శ్యామ్‌సంగ్ వేవ్ 2లో 2.1 A2DP వర్సన్ బ్లూటూత్ కాగా అదే శ్యామ్‌సంగ్ వేవ్ 3లో ఇంకా కొత్త వర్సన్ బ్లూటూత్‌ని అమర్చడం జరిగింది.

శ్యామ్‌సంగ్ వేవ్ 3లో ఉన్న మరో అత్యాధునికి ఫీచర్ ఏమిటంటే టివి అవుట్ జాక్ కూడా లభిస్తుంది. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32 జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. రెండు మొబైల్స్ లలో కూడా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. శ్యామ్‌సంగ్ వేవ్ 2 విడుదల అయినపుడు దీని ధర రూ 16,000 ఉండగా ఇప్పడు అదే శ్యామ్‌సంగ్ వేవ్ 2 ధర రూ 15,000గా మార్కెట్లో లభిస్తుంది. ఇక శ్యామ్‌సంగ్ వేవ్ 3 ధర ఇండియన్ మార్కెట్లో విడుదలవనప్పటికీ సుమారుగా రూ 18,000 నుండి రూ 20,000 వరకు ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot